Telangna Elections 2023 :  తెలంగాణలో ఎన్నికల సందడి పతాక స్థాయికి చేరింది. మంచి రోజు కావడం నామినేషన్లకు ఒక్క రోజే గడువు ఉండటంతో నేతలంతా బలప్రదర్శన చేసి.. నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో బీజేపీ నేతలు.. దాదాపుగా అందరూ ఇవాళే నమిషన్లు దాఖలు చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో  ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు.. కేంద్ర మంత్రి , తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డితో పాటు ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా హాజరయ్యారు.   ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్ర రెడ్డి పోటీ చేస్తున్నాు.   వేలమంది కార్యకర్తలు ర్యాలీగా వెంటరాగ ఇవాళ లక్డీకాపూల్‌‌లో నామినేషన్పత్రాలను  ఎన్నికల అధికారికి అందజేశారు.


తెలంగాణలో ఎలక్షన్ విధులు  నిర్వహిస్తున్న విష్ణువర్ధన్ రెడ్డి                                
 
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ కేంద్ర నాయకత్వం .. ఐదు రాష్ట్రాలకు చెందిన ఇరవై ఆరు మంది నేతలను ఎంపిక చేసింది. వారిలో ఏపీ నుంచి సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు ఉన్నారు. విష్ణువర్ధన్ రెడ్డికి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు,ఎన్నికల సమన్వయం అప్పగించారు. ఈ క్రమంలో ఆయన .. అక్కడే మకాం వేసి .. అభ్యర్థులకు ఎన్నికల్లో పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. నామినేషన్ల కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు కొత్తగా చేరికల్ని ప్రోత్సహిస్తున్నారు. 


సెటిలర్ల ఓట్లపై ప్రత్యేక దృష్టి                                        


తెలంగాణ ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీతో పొత్తు ప్రకటించింది. జనసేన పార్టీ ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసనతో పొత్తు ఉండటం.. లటీడీపీ ఎన్నికల నుంచి విరామం తీసుకోవడంతో ఈ సారి టీడీపీ సానుభూతిపరులు, సెటిలర్ల ఓట్లు.. జనసేన, బీజేపీ కూటమికి కలసి వస్తాయని అంచనా వేస్తున్నారు. జనసేన పార్టీతో టీడీపీ ఏపీలో పొత్తులు పెట్టుకోవడమే దీనికి కారణం. అదే సమయలో సెటిలర్లతో  గ్యాప్ లేకుండా..  జంట నగరాల పరిధిలో.. ఆ రాష్ట్రానికి చెందిన కీలక నేత అయిన విష్ణువర్ధన్ రెడ్డి ద్వారా సమన్వయం చేసుకునే ప్రయత్నాలను చేస్తోంది. అందుకే ఆయనను గ్రేటర్ పరిధిలో ప్రచార, ఎన్నికల వ్యూహాల పర్యవేక్షణకు నియమించినట్లుగా చెబుతున్నారు. 


సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ప్రత్యేక ప్రచారం                 


కిషన్ రెడ్డి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటించనున్నారు.  ఆయన సిట్టింగ్ నియోజకవర్గం సికింద్రాబాద్ కావడంతో.. అన్ని  స్థానాల్లోనూ మంచి  ఫలితాలు చూపించాల్సి ఉంది. తాను పోటీ చేయకపోయినా.. తన స్థానంలో పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కిషన్ రెడ్డికి విష్ణవర్ధన్ రెడ్డి సహకారం అందిస్తున్నారు. కేంద్ర పార్టీ నియమించిన బృందంతో పాటు.. విస్తృతంగా శ్రమిస్తున్నారు.