Telangana TDP : తెలంగాణ టీడీపీ చాప కింద నీరులా పని చేసుకుంటూ పోతోంది. మొదట ఖమ్మం తర్వాత హైదరాబాద్‌లో బహిరంగసభలు పెట్టారు. వీటితోనే సరి పెట్టలేదు. గ్రౌండ్ లెవల్‌లో పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ఇప్పటికే టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రారంభించారు. టీడీపీ బలంగా ఉందని భావించిన నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. పొత్తుల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేతలు మెల్లగా పార్టీ బలోపేతం కోసం తీసుకుంటున్న చర్యలపై చంద్రబాబు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.
ఖమ్మం, హైదరాబాద్ సభల తర్వాత ఉత్సాహం
హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలనుంచి ప్రతినిధులు పాల్గొన డంతో పార్టీలో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఈ ప్రోత్సా హంతో త్వరలో బస్సుయాత్రలు చేపట్టేందు కు కార్య క్రమాలను రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్రలు చేస్తూ ఎక్కడి కక్కడ కమిటీలను నియమిస్తూ ముందుకు వెళ్లాలనే రాజకీయ ఎత్తు గడతో పార్టీ ముందుకు వెళ్లుతుంది. కరీంనగర్ నుంచి ఆదిలాబాద్ వరకు తొలివిడత బస్సు యాత్ర నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. ప్రధానంగా కమ్యూనిస్టుల ప్రాభల్యం ఉన్న ప్రాంతంలో బీఆర్‌ఎస్,బీజేపీకి ప్రత్యామ్య్నాయం గా ప్రజలు టీడీపీని కోరుటుంటున్నారని పార్టీ సర్వేలో తేలినట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బస్సు యాత్ర కరీంనగర్ నుంచి సింగరేణీ ప్రాంతాల మీదుగా ఆదిలాబాద్ వరకు నిర్వహించి ఉత్తర తెలం గాణలో పార్టీ ఊపు తీసుకువచ్చేందుకు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.
వంద నియోజకవర్గాల్ల ోఇంటింటికి తెలుగుదేశం !
ఇటీవల తెలంగాణ టీడీపీ నాయకత్వం ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేతల కొరత ఉండటంతో తొలుత 10 నియోజకవర్గాల్లోపే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. లకానీ ఇప్పుడు 100 నియోజకవర్గాల్లో జరుగుతోంది. టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ భావిస్తూ ఎక్కడికక్కడ పార్టీ నాయకులతో సమా వేశాలు ఏర్పాటుచేస్తూ పార్టీశ్రేణులను ప్రోత్సహిస్తు న్నారు. కాసానికి తెలంగాణ వ్యాప్తంగా పరిచయాలు ఉండటం.. బీసీ నాయకత్వం ఆయనతో కలిసి పని చేసేందుకు ఆసక్తి చూపిస్తూండటంతో టీడీపీ కార్యక్రమాలు వేగం పుంజుకుంటున్నాయి.
బీసీ ఓటు బ్యాంక్‌పై ప్రధానంగా దృష్టి !
రాష్ట్రం విడిపోయినా తెలుగువారంతా ఒ్కకటే కలిసి అభివృద్ధి సాధిద్దాం నినాదంతో ప్రజలమద్దతు పొందేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో 15 స్థానాలను గెలుచుకున్న ఈ పార్టీ ఓట్లు క్రమంగా బీఆర్ఎస్‌కు బదిలీ అయ్యాయి. దీంతో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మిగింది. అయితే ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారినందున నేత చంద్రబాబునాయిడు బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ చేసిన రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారు. ఇది సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.