Telangana SIR Voter List: తెలంగాణలో ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటరు సవరణ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. SIR ముసాయిదా ప్రకటనలో ఏకంగా తెలంగాణలో ఇప్పటికే 73లక్షల ఓట్లను ASDD (Abesent, Shift, Delete, Duplicate)  లో పెట్టారు.  అంటే ఇప్పటికి వీటిని శాశ్వతంగా తొలగించినట్లే. ఈ జాబితాలో  జూన్ నాటికి ఉన్న మొత్తం 3కోట్ల 38లక్షల 26వేల ఓటర్లలో 73లక్షల మందిని పర్మనెంట్‌గా తీసేశారంటే.. పోయిన ఓట్లు ఏకంగా 22శాతం. ఇక మిగిలింది.. 2కోట్ల 65లక్షలు మాత్రమే. మరో 93లక్షల ఓట్లను ఇంకా పెండింగ్‌లోనే ఉంచారు. ఇవన్నీ కూడా 2002 ఓటర్‌ జాబితాతో మ్యాపింగ్ కానివి.. లేదా ఇతర అనామలీస్ అంటే వాళ్లు చెప్పిన వాటికి అక్కడున్న వివరాలకు తేడాలు ఉన్నవి. అంటే డిజిటైజేషన్ అయిపోయిన ఓట్లలో ఇది 35శాతం. 

Continues below advertisement

సగం ఓట్లు సమస్యల్లోనా...?

జూన్ 2026 నాటికి తెలంగాణలో మొత్తం ఓట్ల సంఖ్య ౩,౩8, 26,244. ఓటర్ల జాబితాలో  చాలా అవకతవకలున్నాయి. డూప్లికేట్ ఓటర్లున్నారు. కొంతమంది ఓట్లు మూడు నాలుగు చోట్ల కూడా ఉందనడానికి అనేక ఉదాహరణలున్నాయి. అంతే కాకుండా బయట నుంచి వచ్చిన అక్రమ వలసదారుల ఓట్లను కూడా తొలగించాలన్న ఉద్దేశ్యంతోనే SIR నిర్వహించారు. అందుకే ఇందులో చాలా పకడ్బందీ నిబంధనలున్నాయి. 1987 కంటే ముందు పుట్టిన వాళ్లు వాళ్ల జన్మ దృవీకరణ పత్రం..1987-2004 వరకూ పుట్టినవాళ్లకు వాళ్ల తల్లిదండ్రుల జన్మధృవీకరణ, ఆ తర్వాత జన్మించిన జెన్‌జీలకు వాళ్ల పేరెంట్స్‌తో పాటు..ఓటర్ల జన్మధృవీకరణ తప్పనిసరి చేశారు. అలాగే ఓటు నమోదు చేసుకుంటున్న చోట అక్కడ నివాసానికి సంబంధించిన డాక్యుమెంట్లను పక్కాగా అడిగారు. అవన్నీ అడిగిన తర్వాత చాలా ఓట్లు పోతాయి అనుకున్నారు కానీ.. ఏకంగా 73లక్షల ఓట్లు మాయం అయ్యాయి. ఇది 22శాతం. ఇక్కడితోనే ఆగలేదు.. తెలంగాణలో డిజిటైజేషన్ పూర్తియన ఓట్ల జాబితాలో 2,64,87,213 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా పర్‌ఫెక్ట్ అని చెప్పడం లేదు ఈసీ. ఎందుకంటే ఇందులో కూడా 92,87,577 ఓట్లను విత్‌హెల్డ్‌లో ఉంచింది. అంటే వీళ్ల వాలిడేషన్ పూర్తికాలేదు. దాదాపు 93లక్షల ఓట్లకు సంబంధించి మ్యాపింగ్‌లో వేరియేషన్స్, అలాగే వీళ్లు సమర్పించిన పత్రాల్లో SIR 2002కు సరిపోకపోవడం వంటి కారణాలున్నాయి. డిజిటైజేషన్ పూర్తి అయిన దాంట్లో 35శాతం. ఇందులో ఎంత వరకూ పరిష్కరించి ఓకే చేస్తారో తెలీదు కానీ.. పూర్తిగా తొలగించిన ఓట్లు, సమస్యలు ఉన్న ఓట్లు మొత్తం కలిపి 1,66,26,812. అంటే జూన్‌ వరకూ ఉన్న మొత్తం సగం. ( 49శాతం)

Continues below advertisement

గ్రేటర్ హైదరాబాద్‌లో సగం కంటే ఎక్కువ 

జాబితాలో శాశ్వతంగా లేకుండా పోయిన మొత్తం ఓట్లలో 43లక్షలు కోర్ అర్బన్ రీజియన్ CURE పరిధిలో ఉన్నాయి. అంటే హైదరాబాద్ సహా మూడు జిల్లాలతో కూడా ప్రాతం. రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ కలిపి 43లక్షల ఓట్లు ఇక్కడే పోయాయి. అంతే కాదు.. అభ్యంతరాలు, మ్యాపింగ్ సరిగ్గా అవ్వని ఓట్లు కూడా ఈ మూడు జిల్లాల్లో 39లక్షలు ఉన్నాయి. అంటే తెలంగాణలో పూర్తిగా పోయిన.. పూర్తిగా ఆమోదయోగ్యం కానీ.. కోటీ 60లక్షల ఓట్లలో 83లక్షలు కేవలం మూడు జిల్లాల పరిధిలో ఉన్నాయి. 

కారణాలు ఇవేనా..?

ఈ స్థాయిలో కోర్ అర్బన్ ప్రాంతంలో ఓట్ల జాబితాలో సమస్యలు ఉండటానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. 

  • హైదరాబాద్ మెట్రో సిటీ అవ్వడం వల్ల తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చిన వారు... పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరిలో చాలా మంది SIR ప్రక్రియ వల్ల తమ ఓట్లను తమ ప్రాంతంలోనే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారు. 
  • ఆంధ్ర ప్రాంతంలో ఉన్నవారికి ఎక్కువ మందికి తెలంగాణ, ఆంధ్ర రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా ఒక్క ఓటే ఉండే అవకాశం ఉండటంతో వీళ్లలో ఎక్కువ మంది తమ మూలాలు ఉన్న ప్రాంతంలో ఓట్లను ఎంపిక చేసున్నారు. 
  • తెలంగాణలో ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఉపాధి కోసం వచ్చిన వాళ్లు కూడా తమ సొంత జిల్లాలో ఓట్లను కాపాడుకునేదుకు హైదరాబాద్‌లో ఓటును వదిలేశారు. ఇక హైదరాబాద్‌ పాతబస్తీ ప్రాంతంలో చాలా మందికి సరైన పత్రాలు లేవు. అందుకే ఓటరు జాబితా రివిజన్‌లో ఎక్కువ మంది తిరిగి పత్రాలు ఇవ్వలేదు. 
  • రాష్ట్రవ్యాప్తంగా 73లక్షల ఓట్లు తొలగిస్తే.. అందులో 19లక్షలు ఒక్క హైదరబాద్‌ జిల్లాలో ( గ్రేటర్ హైదరాబాద్ కాదు..) ఉన్నాయి. పాతబస్తీ కవర్ అయ్యే హైదరాబాద్‌లో 47లక్షలకు పైగా ఓటర్లున్నారు. అందులో దాదాపు 40శాతం అంటే 19లక్షల మంది తిరిగి రిజిస్టర్ చేసుకోలేదు. 
  • అలాగే ఇప్పుడు జాబితాలో ఉన్న ఓటర్లలో కూడా సమస్యలున్నాయి. వీళ్లంతా కూడా సర్‌లో పత్రాలు సమర్పించలేకపోయారు. పాతబస్తీ ప్రాంతం మొత్తం కవర్ అయ్యే హైదరాబాద్ జిల్లాలో 6,70వేల మందికి అనామలీస్ ఉంటే.. మరో 6లక్షలమందికి మ్యాపింగ్ లేదు. 

ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ SIR  ప్రక్రియ జరుగుతున్నప్పుడే.. కొత్త ఓటర్లు కూడా నమోదు చేసుకున్నారు. వాళ్ల సంఖ్య చేర్చిన తర్వాత కూడా నాలుగో వంతు ఓట్లు పోాయాయి.