తెలంగాణ పాలిసెట్ -2021 ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణా మండలి పాలిసెట్ ఫలితాలను వెల్లడించింది. ఫలితాలను పాలిసెట్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://polycetts.nic.in/ తో పాటు sbtet.telangana.gov.in, dtets.cgg.gov.in వెబ్‌సైట్‌లలో చూసుకోవచ్చని తెలిపింది. ఎంపీసీ విభాగంలో 81.75 శాతం, బైపీసీ విభాగంలో 76.42 శాతం ఉత్తీర్ణత నమోదైందని పేర్కొంది. తెలంగాణలో టెన్త్ పాస్ అయిన విద్యార్థులకు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జూలై 17వ తేదీన పాలిసెట్ పరీక్ష జరగ్గా.. 1,02,496 మంది దరఖాస్తు చేసుకున్నారు. 92,557 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. షెడ్యూల్ ఇదే.. పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను సైతం ఇటీవలే సాంకేతిక విద్యాశాఖ ప్రకటించింది. పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ఆగస్టు 5 నుంచి  ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఆగస్టు 5 నుంచి 9వ తేదీ వరకు రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ నిర్వహిస్తారు. ఆగస్టు 6వ తేదీ నుంచి 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ కేటాయింపు ఆగస్టు 6 నుంచి 12 వరకు కొనసాగనుంది.

మొదటి విడత సీట్ల కేటాయింపు ఆగస్టు 14వ తేదీన ఉంటుంది. ఆగస్టు 23న చివరి విడత కౌన్సెలింగ్ జరుగుతుంది. 24న చివరి విడత ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం కల్పించారు. ఆగస్టు 24, 25 తేదీల్లో చివరి విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. చివరి విడత సీట్లను ఆగస్టు 27న కేటాయిస్తారు. పాలిటెక్నిక్‌ విద్యాసంవత్సరం సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. స్పాట్‌ అడ్మిషన్లకు సంబంధించి సెప్టెంబరు 9న మార్గదర్శకాలు విడుదల అవుతాయి.

                                                                         ఎంపీసీలో టాప్ ర్యాంకర్లు

ర్యాంక్‌అభ్యర్థి పేరుజిల్లా మార్కులు
1అబ్దుల్ రహమాన్నిజామాబాద్ 118
2సాయి అశ్రిత‌్‌హైదరాబాద్118
3సాయి విజ్ఞేష్హైదరాబాద్118
4రోహన్ కుమార్హైదరాబాద్118
5రమేష్ యాదాద్రి118

                                                                                         ఎంబైపీసీలో టాప్ ర్యాంకర్లు

ర్యాంక్‌అభ్యర్థి పేరుజిల్లా మార్కులు
1రిషిక సిద్దిపేట117
2హిందుప్రియమంచిర్యాల115
3మాధవ్సిద్దిపేట113
4శ్రీవర్థన్వరంగల్ అర్బన్113
5జ్ఞానేశ్వరియాదాద్రి112