Revanth Reddy Latest News: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి (Revanth Reddy) తాత అయ్యారు. రేవంత్‌ రెడ్డి కుమార్తె నైమిషా రెడ్డికి (Nymisha Reddy) మగ బిడ్డ పుట్టాడు. గత వారం తన కుమార్తె నైమిషా రెడ్డికి బాబు పుట్టినట్లుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు. తన ముద్దుల మనవడి ఫొటోను ట్విటర్‌లో షేర్ చేశారు. కుమార్తెకు, మనవడికి ఆశీస్సులు అందిస్తున్నట్లుగా చెప్పారు. రేవంత్‌ రెడ్డి ట్విటర్‌లో పోస్ట్ చేసిన ఈ ఫొటో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ కార్యకర్తలు, రేవంత్ వీరాభిమానులు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి (Revanth Reddy Grand Son) అభిమానులు విపరీతంగా లైక్‌లు చేస్తున్నారు.


Revanth Reddy with Grand Son: మనవడి రాకతో రేవంత్ కు (Revanth Reddy) అదృష్టం కలిసి రావాలని అనుకుంటున్నానని ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. మనవడు వచ్చిన వేళావిశేషంలో రేవంత్ రెడ్డి సీఎం అయిపోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు సహా రాష్ట్ర నేతలు రేవంత్‌కు కంగ్రాట్స్ తెలుపుతున్నారు.






2015 డిసెంబరులో నైమిషా రెడ్డి వివాహం


టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్‌రెడ్డికి ఏకైక కుమార్తె నైమిషా రెడ్డి. ఆ మధ్య తండ్రి రేవంత్‌ రెడ్డి పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు ఆమె తిలకం దిద్ది హారతి ఇచ్చారు. నైమిషా రెడ్డి వివాహం 2015 డిసెంబరులో జరిగిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు సత్యనారాయణ రెడ్డితో వివాహం జరిపించారు. నిశ్చితార్థం అదే ఏడాది జూన్‌లో జరిగింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో అరెస్టు అయి ఉన్నారు. ఏసీబీ కోర్టు ప్రత్యేక అనుమతిపై ఆయన హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్ సెంటర్‌లో (Hyderabad N Convention) జరిగిన కుమార్తె నిశ్చితార్థానికి హాజరు అయ్యారు.


అప్పుడు రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) టీడీపీలో ఉన్నారు. కొడంగల్ నియోజకవర్గ (Kodangal MLA) ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు సత్యనారాయణ రెడ్డితో వివాహం కుదరగానే ఓటుకు నోటు కేసులో చిక్కుకొని రేవంత్‌ రెడ్డి అరెస్టు అయ్యారు. కొద్ది కాలం చర్లపల్లి జైలులో ఉన్నారు. కుమార్తె నిశ్చితార్ధం జూన్ 11, 2015న జరగడంతో ఏసీబీ కోర్టును అనుమతి కోరడంతో షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది కాలానికి రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ఇక్కడ చురుగ్గా ఉండడంతో కాంగ్రెస్ అధిష్ఠానం టీపీసీసీ పదవి కూడా ఇచ్చింది.