Breaking News Live: ఇవాళ సాయంత్రం దిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్, మూడు రోజుల పాటు అక్కడే!

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 03 Apr 2022 05:33 PM
ఇవాళ సాయంత్రం దిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్, మూడు రోజుల పాటు అక్కడే!

సీఎం కేసీఆర్ దిల్లీ వెళ్లనున్నారు. ఆదివారం సాయంత్రం బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం దిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ దిల్లీలోనే ఉండనున్నారు. 

జగిత్యాల జిల్లాలో విషాదం, ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు మృతి

తెలంగాణ జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తుమ్మెనాల గ్రామంలోని చెరువులో ముగ్గురు విద్యార్థులు మునిగిపోయి మరణించారు. ఈతకు వెళ్లి చిన్నారులు చెరువులో గల్లంతు అయినట్లు తెలుస్తోంది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. విద్యార్థుల తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Australia win ICC Womens World Cup: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా

Australia win ICC Womens World Cup: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా


ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా ఆస్ట్రేలియా జట్టు నిలిచింది. ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 71 పరుగుల భారీ తేడాతో ఆసీస్ మహిళలు విజయం సాధించారు.





AP New Districts: ఏపీలో జిల్లాల విభ‌జ‌న‌కు హడావుడి ఎందుకు : బీజేపీ ఎంపీ జీవీఎల్

BJP MP GVL NarasimhaRao On AP New Districts:  ఏపీలో జిల్లాల విభ‌జ‌న‌ను హ‌డావిడిగా చేయాల్సిన అవ‌స‌రం ఎముంద‌ని బీజేపి రాజ్య‌స‌భ స‌భ్యుడు జీవీఎల్ న‌ర‌సింహ‌రావు ప్ర‌శ్నించారు.అర్ద‌రాత్రి పూట హ‌డావిడిగా గెజిట్ ను విడుద‌ల చేయ‌టం స‌రైంది కాద‌ని అన్నారు...పాత జిల్లాకు వంద కోట్లు ,కొత్త జిల్లాల‌కు 200కోట్లు చ‌ప్పున నిదులు విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు...అమ‌రావ‌తి రైతుల‌కు అన్యాయం చేయ‌మంటూనే వారికి క‌నీస మౌళిక వ‌స‌తులు క‌ల్పించ‌టం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు.రాష్ట్రంలో రైతుల‌కు సంబందిచిన స‌మ‌స్య‌ల పై పార్ల‌మెంట్ లో పీయూష్ గోయ‌ల్ క‌ల‌సి లిఖిత పూర్వ‌కంగా విన‌తి ప‌త్రం ఇచ్చామ‌న్నారు.

నేడు ఢిల్లీకి KCR

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేసీఆర్‌తోపాటు ఆయన సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత వెళ్లనున్నారు. జైపూర్ టూర్‌లో ఉన్న ఎంపీ సంతోష్, అటు నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోలుపై వీలైనంత ఎక్కువగా దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల మద్దతు కూడగట్టే పనిలో కేసీఆర్ ఉన్నారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు టీఆర్ఎస్ పిలుపిచ్చింది. ఈనెల 11న టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఢిల్లీలో నిరసన చేపట్టనున్నారు. హస్తిన కేంద్రంగా ధాన్యం అంశాన్ని ప్రధాన అంశంగా బీజేపీ వ్యతిరేక శక్తులను సీఎం కేసీఆర్ కూడగట్టనున్నారు.

పబ్‌లో అరెస్టైయిన వారిలో నిహారిక..

బంజారాహిల్స్ లోని రాడిసన్ బ్లూ పబ్‌లో రేవ్ పార్టీ జరుగుతుందనే సమాచారంతో నార్త్‌జోన్‌, సెంట్రల్‌ జోన్‌, వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం వేకువజామున మెరుపుదాడి చేశారు. మొత్తం 150 పైగా మందిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించగా, వారు పీఎస్ కు తీసుకెళ్లారు. పట్టుబడిన వారిలో 39 మంది యువతులు ఉన్నారు. అయితే విచారణ అనంతరం, వివరాలు సేకరించి 100 మందికి పైగా విడిచిపెట్టగా.. దాదాపు 40 మంది పీఎస్ లో ఉన్నట్లు సమాచారం. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్, టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లి గంజ్, నాగబాబు కుమార్తె, నటి నిహారిక, తదితర ప్రముఖులు ఉన్నారు.

Galla Ashok: దుష్ప్రచారం చేయవద్దని గల్లా అశోక్ కుటుంబసభ్యుల విజ్ఞప్తి

 నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో గల్లా అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీ మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.
- గల్లా కుటుంబ సభ్యులు

ఏపీలో భారీ భూకంపం, అయినా ఏం కాలేదు ఎందుకు?

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం జట్లకొండూరులో భూకంపం వచ్చింది. ఆదివారం అర్థరాత్రి ఒంటిగంటా 10 నిముషాల సమయంలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోగ్రఫీ ప్రకటించింది. ఈమేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో భూకంప కేంద్రం, దాని తీవ్రతపై వార్తనిచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 3.6గా నమోదైందని NCS తెలిపింది. అయితే విచిత్రం ఏంటంటే.. స్థానికులు మాత్రం దీన్ని గుర్తించలేకపోయారు. 3.6 తీవ్రతతో భూకంపం అంటే అంతా అతలాకుతలం అయిపోవాలి. కానీ అలాంటి ఆనవావాల్లేవీ జట్లకొండూరులో లేవు. కనీసం రాత్రి ఏదైనా అలజడి జరిగిందా అనే సమాచారం కూడా చాలామందికి తెలియదు. కొంతమంది మాత్రం ఇంట్లో వస్తువులు పడిపోయాయి, భూకంపాన్ని తాము గుర్తించామని అంటున్నారు. 

Nirmal Collector పేరుతో ఫేక్ వాట్సప్ అకౌంట్

నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేరుతో బిహారీ గ్యాంగ్ ఫేక్ వాట్సాప్ ఖాతా తెరిచింది. 6201570373 నంబర్‌తో కలెక్టర్ పేరుతో పలువురు అధికారులకు సందేశాలు పంపారు. ఈ వ్యవహారాన్ని సదరు అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అది ఫేక్ ఖాతా అని ఎవరూ నమ్మవద్దని కలెక్టర్ సూచించారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు విచారణ చేస్తున్నారు.

Background

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. మధ్యాహ్నం వేళ ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో 40 నుంచి 44 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇకనుంచి 41 నుంచి 45 డీగ్రీల మధ్యలో ఎండలు ఉంటాయని ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వాతావరణ కేంద్రం కొన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయగా, అధిక ప్రభావం ఉండే జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 


ఉత్తర కోస్తాంధ్ర యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోకి ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం మరింత వేడెక్కనుంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం,  ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండల తీవ్రత 40 నుంచి 44 డిగ్రీల దాక ఉండనుంది. కోస్తా ప్రాంతాలు ( విశాఖ​, కాకినాడ​, మచిలీపట్నం) ఇలాంటి చోట్ల ఎండలకంటే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. మంచి ఎండ వేడి, కాస్తంత తేమ ఉండటం వల్ల విశాఖపట్నం పరిసర ప్రాంతాలైన పాడేరు-బొబ్బిలి ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదదని, అవసరమైతే గొడుకు తీసుకుని బయటకు వెళ్లాలని, రోజుకు 5 లీటర్ల నీరు తాగాలని వాతావరణ శాఖ, వైద్య నిపుణులు సూచించారు.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. పెరుగుతున్న వడగాల్పుల వల్ల ఈ రోజు చిత్తూరు, కడప​, కర్నూలు, అనంతపురం జిల్లాలో 40 నుంచి 44 డిగ్రీల దాక ఎండల తీవ్రత ఉంటుంది. అలాగే నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లా (పల్నాడు ప్రాంతం) లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సీమ జిల్లాల్లో భానుడి ప్రతాపంతో ఉక్కపోత, తేమ పెరిగింది. రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కర్నూలు జిల్లా-తెలంగాణ సరిహద్దు ప్రాంతం ముఖ్యంగా నందికొట్కూరు పరిసర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. ఏపీలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 41.5 డిగ్రీలు, నంద్యాలలో 40, అనంతపురం, కడపలో 40.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 


తెలంగాణ వెదర్ అప్‌డేట్స్..
తెలంగాణలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వైపున తెలంగాణ రాష్ట్రంలోనూ ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ ఎండలతో ఉక్కపోత, తేమ అధికం అవుతాయి. హైదరాబాద్ లో నేడు సైతం 40 డిగ్రీల ఎండ ఉంటుంది. ఎండల సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. మధ్యాహ్నం సమయం ఎండలు, వేడి గాలులు ఎక్కువగా ఉంటాయని అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని వాతావరణ కేంద్రం సూచించింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.