Breaking News: హీరో సాయి ధరమ్ తేజ్‌కు ప్రమాదం.. స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 10న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
సినీ హీరో సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఆయన స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తుండగా హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా జంక్షన్‌కు వెళ్లే మార్గంలో ప్రమాదం జరిగింది. ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ముంబయిలో ఓ మహిళ దారుణమైన రీతిలో అత్యాచారానికి గురై స్పృహతప్పిపోయిన స్థితిలో పడి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు 32 ఏళ్లు ఉండే ఓ మహిళపై కిరాతకంగా అత్యాచారం చేయడమే కాకుండా నిందితులు ఆమె ప్రైవేటు అవయవాలపై ఇనుప రాడ్డుతో దాడి చేశారు. రక్తపు మడుగులోనే ఆమెను వదిలేసి పారిపోయారు. ముంబయిలోని సాకినాక ప్రాంతంలోని ఖైరానీ రహదారి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
అనంతపురం జిల్లా యాడికి మండలం రాయల చెరువు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 14 సంవత్సరాల బాలికపై 35 సంవత్సరాల వ్యక్తి అత్యాచారయత్నం చేసినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు రమేష్ పరారీలో ఉన్నాడు. అఘాయిత్యం చేసిన వ్యక్తి రమేష్‌పై ఫోక్సో చట్టం 11&12 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రథమ చికిత్స నిమిత్తం చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.
సూర్యాపేట జిల్లా జానపాడుక దగ్గర లారీ బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి లారీ బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖైరతాబాద్ గణేషుణ్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా నుంచి విముక్తి కలగాలని వినాయకుడిని కోరుకుంటున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. దేశ ప్రజలందరికి కిషన్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు, ఉదయం 10 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ మహా గణపతికి గవర్నర్ తమిళిసై తొలి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు.
హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో అదృశ్యమైన బాలిక అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ ఘటనపై స్థానికులు, బాధిత కుటుంబసభ్యుల ఆందోళన కొనసాగుతోంది. చంపాపేట నుంచి సాగర్ వెళ్లే రోడ్డులో కాలనీవాసులు బైఠాయించాయి. బాలికపై అత్యాచారం చేసి చంపేశాడని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయడంతో పాటు తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బాధితుల ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
జగనన్న అమ్మఒడి, వసతి దీవెన పథకాలకు బదులుగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు టెండర్ నోటీస్ జారీ చేయాలని నిర్ణయించింది. ల్యాప్‌టాప్‌ల కొనుగోలు టెండర్ విలువ రూ. వంద కోట్లు పరిమితి దాటడంతో నోటీసులోని అంశాలను న్యాయసమీక్షకు పంపించింది. బేసిక్ కాన్ఫిగరేషన్‌తో 5.62 లక్షల ల్యాప్‌టాప్‌లు, ఆధునిక కాన్ఫిగరేషన్‌తో 90,926 ల్యాప్‌టాప్‌ల కొనుగోలుకు ప్రభుత్వం టెండర్లు పిలవనుంది.
ఏపీకి నూతన సీఎస్ గా సమీర్ శర్మ నియామకం అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఆయన అక్టోబర్ 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం ఈ నెల 30తో ముగుస్తోంది.
దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న 40 వేలు దాటిన కొత్త కేసులు తాజాగా కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 17.87 లక్షల మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 34,973 మందికి పాజిటివ్‌గా తేలింది. నిన్న 260 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.
కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద బస్సు బోల్తా పడింది. బస్సులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. బెంగళూరు నుంచి మంత్రాలయం దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
మద్యానికి బానిసైన భర్త వేధింపులు భరించలేక చున్నీతో ఉరివేసి భర్తను చంపిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం ధర్మాపురంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రామిదేను సంజీవ(33) మద్యానికి బాసిన అయ్యాడు. తాగివచ్చి భార్యను వేధించేవాడు. గురువారం భార్య సునీతతో గొడవపడ్డాడు. దీంతో ఆమె తాళ్లతో అతన్ని కట్టి చున్నీ మెడకు చుట్టి లాగడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామ వీఆర్‌ఏ ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
గణేష్ ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్‌లోని మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్య వస్తారు. ఈ కారణంతో ట్రాఫిక్ పోలీసులు పలు చోట్ల ట్రాఫిక్ మళ్లించారు. భక్తులు సొంత వాహనాల్లో రాకుండా మెట్రో, ఎంఎంటీఎస్‌లలో రావాలని సైఫాబాద్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాంచందర్ సూచించారు. ఖైరతాబాద్ రోడ్డులో రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి రైల్వే గేటు మీదుగా గణేష్ విగ్రహం వైపు వాహనాలకు అనుమతిలేదు. ఐమ్యాక్స్, మింట్ కాంపౌండ్ మీదుగా ప్రభుత్వ ముద్రణాలయం వైపు వాహనాలకు అనుమతిలేదు. లక్డీకాపూల్‌లోని రాజ్‌దూత్ మార్గంలో వచ్చే వాహనాలు వార్డు కార్యాలయం లేదంటే మార్కెట్ వైపు మళ్లిస్తున్నారు. నెక్లెస్ రోటరీ మీదుగా దర్శనంకోసం వచ్చే వారు తమ కార్లను ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్‌ఎండీఏ పార్కులో పార్కింగ్ చేసుకోవాలి.
Background
హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనీలో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. కాలనీలో గురువారం అదృశ్యమైన చిన్నారి పక్క ఇంట్లో ఉంటున్న రాజు అనే వ్యక్తి ఇంట్లో విగతజీవిగా కనిపించింది. దీంతో స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వారు. స్థానికుల దాడిలో పలువురు పోలీసులకు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. బాలికపై రాజు అఘాయిత్యానికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజును తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మరోవైపు పరారీలో ఉన్న రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -