Telangana housing Board : ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు సొంత ఇళ్లను సమకూర్చేందుకు ఏర్పాటు చేసిన హౌసింగ్ బోర్డు..తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ల తర్వాత అంతర్ధానమయింది. హౌసింగ్ బోర్డును మూసేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేదింటి కలలను నిజం చేసిన గృహనిర్మాణ శాఖ పేరు గతానికే పరిమితం కానుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మా ణంలో, డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకంలో ఈ శాఖ అద్భుత సేవలందించింది. ఇప్పుడు ఈ శాఖ ఉనికి కోల్పోయింది. ఇకమీదట పేదల ఇండ్ల నిర్మాణ పథకాలన్నీ ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోకి చేరనున్నాయి.
టీఆర్‌ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ శాఖ అనేక ఒడిగుదుకులను ఎదుర్కొంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో అనేక అవక తవకలు జరిగాయని, పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని సీబీసీఐడీ విచారణ జరిగింది. ఈ విచారణలో ఈ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు భారీగా అవినీతికి పాల్పన డినట్లు తేలింది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి స్వస్తి పలికిన సీఎం కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారు. 2,68,245 ఇండ్లను రాష్ట్రవ్యాప్తంగా నిర్మించే లక్ష్యంతో పురోగతిలో ఉంది. తాజాగా సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో సరికొత్త పథకాన్ని తెలంగాణ సర్కార్ ప్రకటిం చింది.
అందుకే ఇక గృహనిర్మాణ శాఖ అవసరం లేదని, ఆర్‌అండ్‌బీలో దీనిని విలీనం చేయాలనే నిర్ణయాన్ని అమలు చేసింది. దీంతో ఈ శాఖకు చెందిన విలువైన భూములు, అసంపూర్తి అపార్ట్‌మెంట్లు, ప్లాట్లు, ఇతర ఆస్తులు ఆర్‌అండ్‌బీ ఖాతాలోకి చేరనున్నాయి. గృహనిర్మాణ శాఖ ఆస్తులు, ఉద్యోగులు, సిబ్బందిని ఆర్‌అండ్‌బీ శాఖకు బదలీ చేసింది. పేదలకు సొంతింటి కలను సాకారం చేసే లక్ష|్యంతో ఏర్పాటు చేసిన రాష్ట్ర గృహనిర్మాణ శాఖ తాజా నిర్ణయంతో కనుమరుగు కానున్నది. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ నిబంధనల ప్రకారం మంత్రిత్వ శాఖలు 17కే పరిమితం కావాల్సి ఉంది.
శాఖల విలీనం గతంలోనే ప్ర భుత్వం దృష్టికి వచ్చింది. ఈ కోవలో ఒకే తరహా పనితీరు ఉన్న శాఖలను ఒకే గొడుగు కిందకు చేర్చే ప్రక్రియ కొంత జరి గింది. కొత్తగా ముఖ్యమైన శాఖలను కొనసాగిస్తూ మిగతా వాటిని విలీనం లేదా రద్దు చేయాలనే అంశం తెరపైకి వచ్చి ంది. ఈ నేపథ్యంలోనే గృహనిర్మాణ శాఖ రద్దు జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణ బాధ్యతలను గ్రామీణాభివృద్ధి శాఖకు, పట్టణ ప్రాంతాల్లో పురపాలక శాఖలకు అప్పగించే అంశం పరిశీలనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం హౌసింగ్ శాఖకు చెందిన అసంపూర్తి భవనాలు, ఇండ్లు, ఫ్లాట్లు, ప్లాట్లను ఇప్పటికే వేలం వేస్తోంది. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖలో ఒక ప్రత్యేక విభాగంగా ఉన్న దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ కూడా ఆర్‌అండ్‌బీలో విలీనం కానుంది. ఈ సంస్థకు రాష్ట్రంలో 5,100 ఎకరాల విలువైన భూములున్నాయి.
మరో రెండు నెలల్లో విశాఖ కేంద్రంగా పాలన, మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు