తెలంగాణలో మునుగోడు ఎన్నికల సమయంలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వగా, తాజాగా డివిజన్ బెంచ్ కూడా దాన్నే సమర్థించింది. ఆ తీర్పులో తాము జోక్యం చేసుకోబోమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సహా, ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను డివిజన్ బెంచ్ కొట్టేసింది. దీంతో సీబీఐ విచారణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డివిజన్ బెంచ్‌కు అప్పీలుకు వెళ్లిన తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.


అయితే, ఈ విషయంపై తాము సుప్రీంకోర్టుకు వెళ్తామని కాబట్టి, ఆర్డర్‌ ను సస్పెన్షన్‌లో ఉంచాలని ప్రభుత్వం తరపు న్యాయవాది ద్విసభ్య ధర్మాసనాన్ని కోరారు. అందుకు న్యాయమూర్తులు నిరాకరించారు.