IPS Transfers In Telangana | హైదరాబాద్: తెలంగాణలో ఉన్నతాధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదివరకే పలుమార్లు భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీ జరిగింది. తాజాగా రాష్ట్రంలో 8 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్ ను నియమించారు. ముగ్గురు ఐపీఎస్ లను ఓఎస్డీలుగా నియమించగా, కొందరు ఐపీఎస్ లను ఏఎస్పీలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియమించింది.
అధికారుల బదిలీ స్థానాలు.. ఎవరికి, ఎక్కడంటే.. - కొత్తగూడెం ఓఎస్డీగా పారితోష్ పంకజ్ - గవర్నర్ ఓఎస్డీ (అడిషనల్ ఎస్పీ)గా సిరిసెట్టి సంకీర్త్- ములుగు ఓఎస్డీగా మహేష్ బాబాసాహెబ్- హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పాటిల్ కాంతిలాల్ సుభాష్- భద్రాచలం ఏఎస్పీగా అంకిత్ కుమార్ శంఖావర్- భైంసా ఏఎస్పీగా అవినాష్ కుమార్ నియామకం- వేములవాడ ఏఎస్పీగా శేషాద్రిని రెడ్డి- ఏటూరు నాగారం ఏఎస్పీగా శివం ఉపాధ్యాయ