తెలంగాణలో అంగన్వాడీలకు పండుగ కానుక దక్కింది. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు చేనేత వస్త్రాలు అందించింది ప్రభుత్వం. నేతన్నలను ప్రోత్సహించే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపింది. గురువారం హైదరాబాద్ లోని కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్, మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య దేవ రాజన్ చేతుల మీదగా అంగన్వాడీలకు చీరలు అందించారు. అనంతరం ట్రాన్స్ జెండర్లు తయారు చేసిన చేనేత, జూట్ బ్యాగులను విడుదల చేశారు.



Also Read: Numaish Exhibition: కరోనా ఎఫెక్ట్.. నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ రద్దు


ట్రాన్స్ జెండర్ల చేనేత బ్యాగులు


రాష్ట్రంలోని 31,711 మెయిన్ అంగన్వాడి కేంద్రాలు, 3989 మినీ అంగన్వాడి కేంద్రాలలోని 67,411 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లకు ఈ చేనేత చీరలు అందనున్నాయని మంత్రులు తెలిపారు.  అంగన్వాడీ టీచర్లు, ఆయాలకి ఇప్పటికే రెండు జతల ప్రత్యేక చీరలు అందించామన్నారు. తాజాగా మూడో జతగా చేనేత చీరలు అందించడం సంతోషంగా ఉందన్నారు. అంగన్వాడీ లకు వస్త్రాలు, సరైన వేతనాలు ఇవ్వడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేస్తున్నామని, ప్రీ ప్రైమరీ విద్యను, పోషకాహారాన్ని అందిస్తున్నామని మంత్రులు తెలిపారు. అలాగే చేనేత బ్యాగులు తయారుచేసిన ట్రాన్స్ జెండర్లకు శుభాకాంక్షలు తెలిపారు.


Also Read: Telangana High Court: ఓ వైపు బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతుంటే.. ఎగ్జిబిషన్ కావాలా?


చేనేతను ప్రోత్సహించడానికి అంగన్వాడీలకు చీరలు పంపిణీ


చేనేతను ప్రోత్సహించడానికి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ప్రతి ఏడాది చీరలను అందజేస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం ప్రగతి భవన్‌లో చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు చీరలు పంపిణీ చేశారు. ట్రాన్స్‌ జెండర్లు తయారు చేసిన జ్యూట్‌ బ్యాగులను కూడా మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, ఆయాల వేతనాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మూడుసార్లు సవరించి 30 శాతం పీఆర్సీని పెంచిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేతను ప్రోత్సహించడానికి, నేత కార్మికులకు ఆర్డర్లు పెంచాలనే  ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 31,711 ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలు, 3989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలలోని టీచర్లు, సిబ్బందికి చీరలు పంపిణీ చేయనున్నారు. 


Also Read: Rock Museum: హైదరాబాద్ లో రాక్ మ్యూజియం... 55 మిలియన్ ఏళ్ల నుంచి 3.3 బిలియన్ ఏళ్ల నాటి రాళ్ల ప్రదర్శన... ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్


Also Read: Vanama Raghava Arrest: వనమా రాఘవ అరెస్టు.. కుమారుడిపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు లేఖ రాసిన కాసేపట్లోనే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి