BC reservations are not legally possible:బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్తామని గతంలో చాలెంజ్ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అవి సాధ్యం కాకపోవడంతో ఎలా ముందుకెళ్లాలా అన్నదానిపై కిందా మీదా పడుతోంది. సాధ్యం కావడం లేదు అని ప్రజలు చెప్పడానికి మొహమాట పడుతోంది. అలాగే మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని రేవంత్ ప్రకటన
తెలంగాణలో బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (BC)లకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన కాంగ్రెస్ హామీ, ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని "కామారెడ్డి డిక్లరేషన్"గా ప్రకటించి, BCల ఓటు బ్యాంకును సృష్టించుకుంది. కానీ, తాజా హైకోర్టు స్టే, సుప్రీంకోర్టు తిరస్కారాలు, ఆర్థిక-చట్టపరమైన సమస్యల మధ్య, "ఇది సాధ్యమే కాదని " క్లారిటీ వస్తోంది. తెలంగాణలో BCలు 56 శాతం జనాభా ఉన్నారు. కులగణనలో ఇది తేల్చారు. కానీ 29 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవి ఉద్యోగ, విద్య అవకాశాల్లో. రాజకీయంగా అయితే స్థానిక ఎన్నికల్లో 25 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉంది.
కులగణన చేసినా .. బిల్లులకు లభించని ఆమోదం
కాంగ్రెస్ 'కామారెడ్డి BC డిక్లరేషన్'లో BCలకు 42% రిజర్వేషన్లు, కులగణన చేస్తామని ప్రకటించారు. కులగణన చేశారు. హౌస్-టు-హౌస్ డేటా కలెక్షన్ చేశారు. BCలు 56.33% అని రిపోర్ట్ వచ్చింది. ఈ డేటా ఆధారంగా అసెంబ్లీలో రెండు బిల్లులు పాస్ చేశారు. విద్య, ఉద్యోగ లోకల్ బాడీల్లో 42% BC కోటా కల్పించారు. కానీ సుప్రీంకోర్టు పెట్టిన 50% కోటాను దాటిపోతుంది. బిల్లులు ఆమోదించాలని ఆగస్టులో రేవంత్ ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. చివరికి జీవో ఇచ్చారు. ా జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం సుప్రీంకోర్టులో SLP ఫైల్ చేసింది. ఆ ఎస్ఎల్పీని సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్ లో పెడితేనే చెల్లుబాటు.. అది సాధ్యం కాదు !
ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ ను ప్రధానిని చేసుకుని బిల్లును ఆమోదించుకుంటామని ప్రకటించారు. అంటే ఆయనకు ఇప్పుడల్లా లీగల్ గా రిజర్వేషన్లు రావని క్లారిటీ ఉన్నట్లే. అయితే బిల్లులు ఆమోదించడం లేదని కేంద్రాన్ని నిందిస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి "42% కోటా సైంటిఫిక్, BCల హక్కు. బిజేపీ కేంద్రం బిల్లులు పెండింగ్‌లో పెట్టి BCలను మోసం చేస్తోంది" అని ఆరోపిస్తున్నారు. కానీ న్యాయపరంగా ఊరట లభించలేదు. ప్రభుత్వం సుప్రీంకోర్టులో SLP ఫైల్ చేసింది, కానీ SC "హైకోర్టు స్టే సరైనది" అని తిరస్కరించింది.
ఇప్పటికీ అది సాధ్యం కాదని ప్రజలకు చెప్పలేకపోతున్న ప్రభుత్వం
సుప్రీం కోర్టు 1992 ఇంద్రా సాహ్ని జడ్జ్‌మెంట్ ప్రకారం 50% రిజర్వేషన్ క్యాప్ పెట్టింది. కానీ తమిళనాడు 69 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్‌లో పెట్టారు. కానీ తెలంగాణకు అది సాధ్యం కాదు. రాజ్యాంగసవరణ అవసరం. అది ఇప్పుడల్లా సాధ్యం కాదు. అందుకే సీఎం రేవంత్ బీసీ రిజర్వేషన్ల అంశంపై.. ప్రజలకు నిజాలు చెప్పి.. పార్ట ీపరంగా రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే ప్రజలు ముఖ్యంగా బీసీలు తమను మోసం చేశారని అనుకునే ప్రమాదం ఉంది.