Karnataka Special Cucumber Idli Recipe : ఇడ్లీలను చాలామంది ఇష్టంగా తింటారు. పేషెంట్లకు కూడా ఇది మంచిది. అందుకే బ్రేక్​ఫాస్ట్​గా ఎక్కువగా తీసుకుంటారు. ఎక్కువగా మినప పిండితో చేసుకునే ఇడ్లీలే ఉంటాయి. అయితే ఆరోగ్యం దృష్ట్యా ఈ పిండిని మిల్లెట్స్​తో, రాగిపిండితో చేసుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలుసా? కీరదోసతో ఇడ్లీలు చేసుకోవచ్చని. అవును ఈ స్పెషల్ రెసిపీ చేసేందుకు ఎంత సులభమో.. తినేందుకు అంత టేస్ట్​ని ఇస్తాయి. మరి వీటిని ఎలా చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం.

Continues below advertisement

కావాల్సిన పదార్థాలు

కీరదోస - ఒకటిన్నర 

ఇడ్లీ రవ్వ - ముప్పావు కప్పు

Continues below advertisement

ఉప్పు - రుచికి తగినంత 

కొబ్బరి తురుము - ముప్పావు కప్పు

పచ్చిమిర్చి - రెండు

కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు

నీళ్లు - 2 టేబుల్ స్పూన్లు 

తయారీ విధానం

ముందుగా కీరదోసను తురుముకోవాలి. దానిలో రవ్వనిలో రవ్వ, ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాలు పక్కన పెట్టాలి. ఈలోపు కొబ్బరి తురము, పచ్చిమిర్చిని కలిపి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దీనిలో కీరదోస మిశ్రమాన్ని కూడా వేసి.. నీళ్లు వేసి మిక్స్ చేయాలి. కొత్తిమీర తురుము వేసి కలపాలి. చివరిగా సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవావి. ఇప్పుడు దీనిని మరో 5 నిమిషాలు పక్కనే ఉంచి ఇడ్లీపాన్ సిద్ధం చేసుకోవాలి.

ఇడ్లీ ప్లేట్స్​కి నూనె లేదా నెయ్యి రాసి ఇడ్లీ పిండి పెట్టవచ్చు. లేదా అరటి ఆకులను కోన్ రూపంలో చుట్టి.. దానిలో ఇడ్లీ పిండి వేసి.. పొట్టిక్కలు మాదిరిగా కూడా చేసుకోవచ్చు. ఇలా ప్లేట్ సెట్ చేసిన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు వండుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే కూర లేదా చట్నీతో తింటే అద్భుతహా అనుకోవాల్సిందే. కొబ్బరి చట్నీ లేదా పల్లీ చట్నీ దీనికి బెస్ట్ కాంబినేషన్. 

ఈ స్పెషల్ రెసిపీని కర్ణాటకలో చాలామంది ఇష్టంగా తింటారు. పిల్లలకు హెల్తీగా తినట్లేదు అనుకున్నప్పుడు వారికి దీనిని పెట్టవచ్చు. ఆరోగ్యపరంగా హెల్తీ డైట్ ఫాలో అయ్యేవారికి కూడా ఇది మంచి ఫుడ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కీరదోస ఇడ్లీలు ట్రై చేసేయండి.