Telangana News :  ఏప్రిల్‌ 14 న అంబేద్కర్‌ పుట్టిన రోజు సందర్భంగా  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగసభ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించుకుంది.  అంబేద్కర్‌ విగ్రహం స్థాపించాలని నిర్ణయం తీసుకున్న నాటినుంచి రెండేళ్ల పాటు విస్తృతంగా శ్రమించి విగ్రహాన్ని సిద్ధం చేశారు.  పలు దేశాలు ప్రాంతాలు తిరిగి సమాచారాన్ని సేకరించి పూర్తి స్వదేశీ పరిజ్జానంతోనే రూపొందించారు. ఈ విగ్రహావిష్కరణ  అట్టహాసంగా నిర్వహించాలని నిర్ణయించారు.  ఏప్రిల్‌ 14న 125 అడుగుల ఎత్తౖన అంబేద్కర్‌ విగ్రహావిష్కరణ, 30న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయం ప్రజలకు, దేశంలోని సందర్శకులకు, ప్రభుత్వ పాలనకు అందుబాటులోకి రానున్నాయి. 


దేశం గర్వించదగ్గ రీతిలో అందరివాడు డా.బిఆర్‌ అంబేద్కర్‌ మహాశ యుని మహా విగ్రహాన్ని  ఆవిష్కరించుకోబోతున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.   భారత రాజ్యాం గ నిర్మాత, భారత రత్న, డా. బిఆర్‌ అంబేద్కర్‌ మహాశయుడు కనబరిచిన దార్శని కతతోనే దళిత గిరిజన బహుజన వర్గాలతో పాటు సకల జనులందరికీ ఆర్థిక, సామాజిక న్యాయం, అన్ని రంగాల్లో సమాన న్యాయం అమల్లోకి వచ్చిందని, ఇందుకోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ప్రపంచం గర్వించదగ్గ మేధావి డా. బిఆర్‌ అంబేద్కర్‌ అని ప్రభుత్వం ప్రకటించింది.   





 
 
పక్కనే సచివాలయం, ఎదురుగా తన ఆరాధ్యుడు బుద్ధుని విగ్ర#హం, మరోదిక్కు త్యాగాలు చేసిన అమర వీరుల స్మారక స్థూపం..వీటి నడుమ శిఖరమంత ఎత్తున నిలిచిన అంబేద్కర్‌  నడుమ ఓ ప్రత్యేకాకర్షణగా సెక్రటేరియట్ ఉండనుంది..  125 అడుగుల ఎత్తులో నిర్మించిన డా. బిఆర్‌ అంబేద్కర్‌ మహా విగ్రహాన్ని, శోభాయమానంగా.. తెలంగా ణ సమాజంతో పాటు యావత్‌ దేశ ప్రజలు సంబురపడేలా గొప్పగా ఆవిష్క రించుకోవాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు.    అంబేద్కర్‌ ఆశయాల సాధన కోసం ప్రజా ప్రతినిధులు, యావత్‌ ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలనే గొప్ప సంకల్పంతోనే.. రాష్ట్ర సచివాలయానికి ఆయన పేరు పెట్టుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహస్తున్న కార్యక్రమాన్ని తగు జాగ్రత్తలతో పకడ్బందీగా నిర్వహంచాలని ఆదేశించారు. రాష్ట్రం నలు మూలలనుంచి విగ్రహావిష్కరణ కోసం వచ్చే అతిథులు, ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి’ అని మంత్రులకు, ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.  


విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత, రాష్ట్రం నలుమూలలనుంచే కాకుండా దేశవ్యాప్తంగా అంబేద్కర్‌ అభిమానులు సామాజిక వేత్తలు సామాన్యులు విగ్రహ సందర్శనకోసం వస్తారని అంచనా వేస్తున్నారు. విగ్రహం వద్ద నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయనున్నారు.  ఏర్పాట్లన్నీ మరో నెల రోజుల పాటు కొనసాగించాలని మంత్రులను, అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.   4 దశాబ్దాల క్రితమే ఎమ్మెల్యేగా వున్నప్పుడు భారత దేశ దళితుల స్థితి గతులను ప్రపంచంలోని అణగారిన వర్గాలతో పాటు పోల్చుతూ అధ్యయనం చేయాలనే తలంపుతో ‘సెంటర్‌ ఫర్‌ సబాల్టర్న్‌ స్టడీస్‌ ‘ అనే అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేశానని కేసీఆర్ గతంలో ప్రకటించారు.