Telangana Fee Reimbursement reforms: తెలంగాణ ప్రభుత్వం ఫీ రీఇంబర్స్‌మెంట్ స్కీమ్‌ను సంస్కరించడానికి, నిధులు దుర్వినియోగం కాకుండా ఉండటానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే తమకు పెద్ద ఎత్తున బకాయిలు ఉన్నాయని ప్రైవేటు కాలేజీలు సమ్మె ప్రారంభించాయి. ఈ క్రమంలో ప్రభుత్వం పథకంలోనే సంస్కరణలు ప్రారంభించడం సంచలనంగా మారింది. ఈ కమిటీ మూడు నెలల్లోపు సమగ్ర నివేదిక సమర్పించనుంది. తెలంగాణలో 2008లో ప్రవేశపెట్టిన ఫీ రీఇంబర్స్‌మెంట్ స్కీమ్ (RTF - Reimbursement of Tuition Fees) SC, ST, BC, మైనారిటీలకు చెందిన విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్య అందిస్తోంది. ఈ స్కీమ్ వల్ల ప్రభుత్వం భారీ ఆర్థిక భారం పడుతోంది. ప్రస్తుతం రూ.10,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఆగస్టు-సెప్టెంబర్‌లో రూ.600 కోట్లు విడుదల చేసినప్పటికీ, మిగిలిన మొత్తం కోసం కాలేజీలు ఒత్తిడి పెంచుతున్నాయి. నవంబర్ 1 నాటికి రూ.900 కోట్లు విడుదల చేయాలని FATHI డిడ్‌లైన్ ఇచ్చింది. దీనికి స్పందన లేకపోవడంతో, 1,500కి పైగా ప్రైవేట్ ప్రొఫెషనల్, డిగ్రీ, PG కాలేజీలు నవంబర్ 3 నుండి బంద్ పాటిస్తున్నాయి. నవంబర్ 6న రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది సిబ్బంది పాల్గొనే భారీ నిరసనకు పిలుపునిచ్చారు. దీనికి రెండు రోజుల ముందుగానే కమిటీని నియమించారు
సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ చైర్మన్ గా ఉంటారు. అధికారులతో పాటు కోదండరాం, కంచె ఐలయ్య, కాలేజీల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ట్రస్ట్ బ్యాంక్ ద్వారా స్వయం స్థిరత్వం కలిగిన ఫీ రీఇంబర్స్‌మెంట్ స్కీమ్ అధ్యయనం., ఫీ రీఇంబర్స్‌మెంట్ పాలసీ రేషనలైజేషన్‌కు పారదర్శక, స్థిరమైన ఫ్రేమ్‌వర్క్ సూచనలు., ఉన్నత విద్యా వ్యవస్థ మెరుగుపరచడానికి సూచనలు, మూడు నెలల్లోపు వివరణాత్మక నివేదిక సమర్పణ ఈ కమిటీ విధులు. అప్పటి వరకూ గడువు ఇచ్చినందుకు కాలేజీలు సమ్మె విరమిస్తాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.