2025 Royal Enfield Bullet 650 Revealed: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌. ఈ కంపెనీ, తన కొత్త బుల్లెట్‌ 650ని మిలాన్‌లో జరిగిన EICMA 2025 ఆటో షోలో ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్‌ ద్వారా 650cc సిరీస్‌లోకి లెజండరీ "బుల్లెట్‌" ను కూడా తీసుకు వచ్చింది. ఈసారి కొత్త లుక్‌, క్లాసిక్‌ ఫినిష్‌తో మరింత రాయల్‌గా మారింది.

Continues below advertisement

Bullet 650, Classic 650తో చాలా పోలికలు ఉన్నప్పటికీ, తన సొంత ఐడెంటిటీని మాత్రం బలంగా కొనసాగించింది. ఎన్‌ఫీల్డ్‌ అభిమానులు గుర్తించే ఆ ట్రెడిషనల్‌ క్రోమ్‌ హెడ్‌లైట్‌ హుడ్‌, హ్యాండ్‌ పెయింట్‌ చేసిన ఫ్యూయల్‌ ట్యాంక్‌ లైన్స్‌, మెటల్‌ బ్యాడ్జ్‌, ట్విన్‌ పైలట్‌ లాంప్స్‌ - అన్నీ కలిసి బుల్లెట్‌ లుక్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి.

క్లాసిక్‌ టచ్‌లో కొత్త టెక్నాలజీఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌ విషయానికి వస్తే, క్లాసిక్‌ 650లో ఉన్న డిజి-అనలాగ్‌ సెటప్‌ను ఈ కంపెనీ బుల్లెట్‌ 650లోనూ ఇక్కడ కూడా కొనసాగించింది. అంటే, స్పీడోమీటర్‌ అనలాగ్‌గా ఉండగా, ఫ్యూయల్‌ గేజ్‌ & ఓడోమీటర్‌ డిజిటల్‌ డిస్‌ప్లేలో కనిపిస్తాయి. మెరిసే అల్యూమినియం స్విచ్‌గేర్‌, అడ్జస్టబుల్‌ బ్రేక్‌, క్లచ్‌ లివర్స్‌ కూడా ప్రీమియం టచ్‌ ఇస్తాయి.

Continues below advertisement

పవర్‌ఫుల్‌ 648cc ఇంజిన్‌ఇంజిన్‌ విషయానికి వస్తే, బుల్లెట్‌ 650లో, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 650 సిరీస్‌కి చెందిన అదే 648cc ప్యారలల్‌-ట్విన్‌ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 47 హార్స్‌పవర్‌ పవర్‌, 52.3 Nm టార్క్‌ ఇస్తుంది. సస్పెన్షన్‌లో షోవా టెలిస్కోపిక్‌ ఫోర్క్‌ (ఫ్రంట్‌లో 120mm ట్రావెల్‌) & ట్విన్‌ షాక్‌ అబ్జార్బర్స్‌ (రియర్‌లో 112mm ట్రావెల్‌) ఉన్నాయి. ఇవి రోడ్‌పై స్టెబిలిటీ, కంఫర్ట్‌ రెండింటినీ ఇస్తాయి.

రెండు కలర్‌ ఆప్షన్లుబుల్లెట్‌ 650 ని రెండు రంగుల్లో ఆవిష్కరించారు, అవి - ఒకటి క్లాసిక్‌ బ్లాక్‌, రెండోది కొత్త బ్లూ షేడ్‌. బ్లాక్‌ వేరియంట్‌ ఎప్పటిలాగే రాయల్‌ లుక్‌ని కొనసాగిస్తే, బ్లూ షేడ్‌ యువతరానికి ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇండియాలో ఎప్పుడు లాంచ్‌ అవుతుంది?భారత్‌లో లాంచ్‌ డేట్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ Motoverse 2025 (నవంబర్‌ 21) నాటికి ఇండియాలోకి ఎంట్రీ ఇస్తుందనే అంచనా ఉంది.

స్పెషల్‌ ఎడిషన్‌ క్లాసిక్‌ 650 కూడా...EICMAలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 125 వార్షికోత్సవం సందర్భంగా Classic 650 Limited Edition ను కూడా ఆవిష్కరించింది. మెకానికల్‌గా ప్రస్తుత క్లాసిక్‌ లాగే ఉన్నప్పటికీ, ఈ లిమిటెడ్‌ వెర్షన్‌ పెయింట్‌ ఫినిష్‌ మాత్రం ప్రత్యేకం. ఎరుపు-బంగారం రంగుల మేళవింపుతో మెరిసిపోతోంది. ట్యాంక్‌పై ‘125 Years’ క్రెస్ట్‌ & సైడ్‌ ప్యానెల్స్‌పై స్పెషల్‌ లోగోలు ఈ ఎడిషన్‌ను ప్రత్యేకంగా నిలబెడతాయి.

బుల్లెట్‌ 650 అనేది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అభిమానులకు క్లాసిక్‌ లుక్‌లోనే మోడర్న్‌ పెర్ఫార్మెన్స్‌ ఇచ్చే కలయిక. పవర్‌ఫుల్‌ ఇంజిన్‌, ప్రీమియం ఫినిష్‌, లెజెండరీ ఐడెంటిటీ వంటివి బుల్లెట్‌ 650ని మళ్లీ ఒక కల్ట్‌గా మార్చేస్తాయి. ఈ బండి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నవారికి నవంబర్‌ 21న మోటోవర్స్‌లో హైలైట్‌గా నిలుస్తుందని చెప్పవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.