Telangana government secrets leaked to BRS : తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్  లోని ఔటర్ లోపల పరిశ్రమల భూములను మల్టీ-యూస్ జోన్లుగా మార్చే 'హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP)'పై తీసుకున్న నిర్ణయం ముందే బయటకు లీక్ అవడాన్ని సీరియస్ గా తతీీసుకుంందది.  జీవో  GO-27  విడుదలకు ముందే విపక్షాలకు సమాచారం అందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌ అయ్యారు.  అంతర్గతంగా ఏమి జరిగిందో తేల్చేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల శాఖలో పాలసీ తయారీ దశలోనే లీక్ జరగడంపై ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.          

ప్రభుత్వ నిర్ణయాలు ముందే విపక్షానికి లీక్                   

HILT పాలసీకి సంబంధించిన  ఫోటోషాప్ స్లైడ్స్ బయటకు లీక్ అయినట్టు గుర్తించారు.  ఇవి పాలసీ డ్రాఫ్ట్ లేదా క్యాబినెట్ నోట్‌ల నుంచి తీసుకున్నవిగా తెలుస్తోంది.  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి, HILT పాలసీని  రూ.5 లక్షల కోట్ల భూమి మోసం గా ఆరోపించారు. అప్పటికి ప్రభుత్వం జీవో జారీ చేయలేదు. జీవో విడుదలకు ముందే పాలసీ వివరాలు బయటపడ్డాయి. కేటీఆర్ ఈ లీక్ సమాచారంతోనే ప్రెస్‌మీట్‌లో  ప్రభుత్వంపై దాడి చేశారు.  తర్వాత ప్రభుత్వం GO-27 విడుదల చేసింది. ఈ ఆర్డర్‌లో ఔటర్ రింగ్ రోడ్ ( లోపల 22 పరిశ్రమల పార్కుల్లో 9,292 ఎకరాల భూములను కమర్షియల్, రెసిడెన్షియల్ ఉపయోగాలకు మార్చే వివరాలు ఉన్నాయి.

విజిలెన్స్ దర్యాప్తులో కీలక వ్యక్తి గురించి సమాచారం వెలుగులోకి            

ఈ టైమ్‌లైన్ ప్రకారం, పాలసీ తయారీ దశలో సమాచారం లీక్ అయినట్టు స్పష్టమవుతోంది. ప్రభుత్వం ఈ లీక్‌ను తీవ్రంగా తీసుకుని, ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) ,  చీఫ్ సెక్రటరీ ఆఫీస్‌లు కోవర్టులను గుర్తించేందుకు చర్యలు తీసుకున్నాయి.  పరిశ్రమల శాఖలో పాలసీ తయారీ సమయంలో లీక్ చేసినవారిని తేల్చేందుకు విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో మిడ్-లెవల్ అధికారులు, మంత్రుల ఆఫీసుల సిబ్బంది, సీనియర్ అధికారుల చాంబర్లు  అన్నింటిపై నిఘా పెట్టి విచారణ జరిపారు.   '        

కఠిన చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం          

ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత కీలక సమాచారం ఇలా బయటకు వెళ్లడాన్ని తేలికగా తీసుకుంటే ఇక ప్రతి నిర్ణయమూ అలా చేరిపోతుందని ప్రభుత్వం భావించింది.  అంతర్గతంగా ఏం జరిగిందనే దానిపై విజిలెన్స్‌   విచారణ పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. మంగళవారం  సిఎస్  రామకృష్ణారావు కు విజిలెన్స్ రిపోర్ట్ అందడంతో..  చర్యలు తీసుకోనున్నారు. లీక్ కు కారణం ఎవరు అనేది, అసలు ఏం జరిగింది అనే దానిపై  విజిలెన్స్ పూర్తి రిపోర్టు అందించింది. ప్రభుత్వ పెద్దలు ఇలా ఎంత కాలం నుంచి సమాచారాన్ని విపక్షాలకు పంపిస్తున్నారు.. ఇతర శాఖల్లో ఎంత మంది ఉన్నారో మొత్తం ఆరా తీస్తోంది. ప్రస్తుతం నివేదిక సీఎం టేబుల్ పై ఉన్నట్లుగా తెలుస్తోంది.