TS New Mandals : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మరో 13 మండలాల ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త మండలాల ఏర్పాటుకు ఈ ఏడాది జులై 23న ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసింది. స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీఎస్ సోమేశ్‌కుమార్ జులైలో ఉత్తర్వులు జారీచేశారు. తాజాగా కొత్త మండలాల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ఇచ్చింది.
కొత్త మండలాలకు తుది నోటిఫికేషన్
తెలంగాణ ప్రభుత్వం పరిపాలానా సంస్కరణల్ని వేగంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. గతంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు అనేక మండలాలను కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించిన ప్రభుత్వం తాజాగా పదమూడు మండలాలను ఏర్పాటు చేస్తూత తుది నోటిఫికేషన్ ఇచ్చింది.
కొత్త మండలాలు ఇవే
- సిద్దిపేట జిల్లా - అక్బర్‌పేట-భూంపల్లి, కుకునూరుపల్లి
- కామారెడ్డి జిల్లా - డోంగ్లి
- నిజామాబాద్ జిల్లా - ఆలూర్, డొంకేశ్వర్, సాలూరా
- మహబూబర్‌నగర్ జిల్లా - కౌకుంట్ల
- జగిత్యాల జిల్లా - ఎండపల్లి, భీమారం
- సంగారెడ్డి జిల్లా - నిజాంపేట్
- నల్గొండ జిల్లా - గట్టుప్పల్
- మహబూబాబాద్ జిల్లా - సీరోలు, ఇనుగుర్తి