Telangana Elections 2023 :  రైతుబంధు పంపిణీకి ఎలక్షన్ కమిషన్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 24వ తేదీ నుంచే రైతుల ఖాతాల్లో రబీ పెట్టుబడి సాయం జమ చేసుకోవచ్చని చెప్పింది.  డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్​ఫర్) చేస్తున్నందున రైతుబంధు ప్రభావం ఓటర్లపై ఉండదని తెలిపింది. రాష్ట్రంలో యాసంగి సీజన్‌కు రైతుబంధు సాయం పంపిణీపై ప్రభుత్వం ఇటీవల ఎలక్షన్ కమిషన్ అనుమతి కోరింది.  తాజాగా దీనిపై  బదులిచ్చిన ఈసీ.. రైతుబంధు పంపిణీకి ఓకే చెప్పింది. 
   
ఈసీ అనుమతి రావడంతో వెంటనే డబ్బులు జమ చేస్తారేమోనని రైతులు అనుకున్నారు. కానీ  రైతుబంధు పంపిణీపై వ్యవసాయ శాఖ నుంచి విడుదలైన ప్రకటనలో ఆ విషయం స్పష్టత రాలేదు.  ఈ నెల 25, 26 ,27 తేదీల్లో బ్యాంకు సెలవులు ఉన్నాయి.  ఈ నెల 29, 30 తేదీల్లో రైతుబంధు పంపిణీకి ఎన్నికల కమిషన్ అనుమతించలేదని వ్యవసాయ శాఖ తెలిపింది. రైతు బంధు సాయం పంపిణీని 28న మాత్రమే పంపిణీ చేయాల్సి ఉంటుంది. నిజంగా చేయాలనుకుంటే ఆ ఒక్క రోజు అందరి ఖాతాల్లోకి నగదు జమ చేయవచ్చు. కానీ ప్రభుత్వం వద్ద నిధులు ఉండాలి. ఖజానాలో ఏడున్నర వేల కోట్లు ఉంటే వెంటనే జమ చేయవచ్చు. 


కానీ గతంలోలా ... ముందుగా ఎకరం ఉన్న వాళ్లకు పంపిణీ చేస్తామని..  వరసగా పంపిణీ చేస్తూ పోతామని ప్రభుత్వం తెలిపింది. అంటే..  ఒక్క రోజులో పంపిణీ అయ్యే అవకాశం లేదని పరోక్షంగా చెప్పినట్లయింది.   29, 30 తేదీల్లో పంపిణీ చేయకూడదని ఈసీ చెప్పింది కాబట్టి సాధ్యం కాదు. అాల పంపిణీ చేస్తే కేసులు నమోదవుతాయి. ఇక చాయిస్ ఎన్నికలు ముగిశాకే రైతుల అకౌంట్లో జమ చేయడం. అందుకే.. ఇరవై ఎనిమిదో తేదీన ఎవరి అకౌంట్లలో డబ్బులు పడితే వారికి రైతు బంధు వచ్చినట్లు లేకపోతే.. మిగిలిన వారు ఎదురు చూడాల్సిదేనని భావిస్తున్నారు.                   


రైతు బంధు అంశం మొదటి నుంచి రాజకీయ వివాదంగానే ఉంది. రైతు బంధు పథకానికి నిధులు ఇస్తామంటే కాంగ్రెస్ అడ్డుకుందని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన మొదట్లో తీవ్ర విమర్శలు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. రైతు బంధుకు నిధులు ఇస్తామని ఇలా అడగగానే అలా ఈసీ అనుమతి ఇచ్చింది.  ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ఎవరికైనా ప్రభుత్వం డబ్బులు జమ చేయాలనుకుంటే.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందే పూర్తి చేయించాలని.. ఆ తర్వాత వద్దని కాంగ్రెస్ పార్టీ ముందే ఫిర్యాదు చేసింది.  పోలింగ్ కు ఐదు రోజుల ముందు లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసే అవకాశాన్ని కల్పించింది. అవేమీ జీతాలు కాదని పోలింగ్ అయిన తర్వాత ఒకటో తేదీన పంపిణీ చేసినా నష్టమేమిటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. గతంలో జనవరిలో కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయంటున్నారు.                         


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply