Telangana Elections 2023 Congress BC Declaration : తెలగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో కుల గణన నిర్వహించి జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. బీసీ-డీలో ఉన్న ముదిరాజులను బీసీ-ఏ లోకి మారుస్తామని, నేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. శుక్రవారం కామారెడ్డి లో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. కర్నాటక సీఎం సిద్దరామయ్య, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీతో, టీజేఎస్ చీఫ్ కోదండరామ్, కమ్యూనిస్టు ముఖ్య నేతలతో పాటు పలువురు నాయకులు హాజరైన ఈ సభలో బీసీలకు కీలక హామీలు ఇచ్చింది.


స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ 


స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ 42 శాతం పెంచుతామని, బీసీ సబ్ ప్లాన్ ప్రవేశ పెట్టడంతో పాటు వైన్ షాపులో గౌడ్లకు ప్రస్తుతం ఇస్తున్న 15 రిజర్వేషన్ 25 శాతానికి పెంచుతామని పేర్కొంది. జనగామ జిల్లాను సర్వాయి పాపన్న సర్దార్ పాపన్న పేరు పెడుతామని, ఐదేళ్లలో బీసీల అభివృద్ధి కోసం లక్ష కోట్ల ఖర్చు చేస్తామని, రాష్ట్రంలో మూడు చోట్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తమని హామీ ఇచ్చింది. ప్రతి మండలానికి ఓ బీసీ గురుకులాన్ని ఏర్పాటు చేయడంతో పాటు బీసీ సంక్షేమ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి జిల్లాకు బీసీ భవన్ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.


చేనేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్  


బీసీ సబ్ ప్లాన్ ను ప్రవేశపెట్టనున్నట్టుగా కాంగ్రెస్  హామీ ఇచ్చింది.   ఐదేళ్లలో బీసీల అభివృద్దికి లక్ష కోట్లను ఖర్చు చేయనున్నట్టుగా  కాంగ్రెస్ వివరించింది.   బీసీ కార్పోరేషన్ ద్వారా ఒక్కొక్కరికి  రూ. 10 లక్షల రుణ సౌకర్యం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. చేనేత కార్మికులకు 50 ఏళ్లు దాటితే పెన్షన్ అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. జనగామ జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా మారుస్తామని  హస్తం పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో  మూడు చోట్ల మెగా పవర్ లూమ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ తెలిపింది.




బీసీ డిక్లరేషన్ లోని అంశాలు:


స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు 22 నుంచి 42 శాతానికి పెంపు.
బీసీలకు రాజకీయంగా మరిన్నీ అవకాశాలు.
ప్రతి మండలంలో బీసీలకు ప్రత్యేక గురుకులాలు.
ఐదేళ్లలో బీసీల అభివృద్ధికి రూ.లక్ష కోట్లు. 
50ఏళ్లు దాటిన పద్మశాలీలకు పించన్ సౌకర్యం.
మహాత్మ జ్యోతి బాపులే సబ్ ప్లాన్ కింద ప్రతి ఏటా రూ.20వేల కోట్లు.
జిల్లా కేంద్రాల్లో బీసీలకు ప్రత్యేక భవనాలను నిర్మాణం.
విశ్వకర్మలు, మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు. 
గద్వాల్, సిరిసిల్ల, నారాయణ్ ఖేడ్ లో పవర్ లూమ్స్ ఏర్పాటు
రజకుల కోసం రూ.10 లక్షల సబ్సిడీ.
కాంగ్రెస్ ప్రభుత్వంలో వెనుకబడిన తరగతుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు.
వెనుకబడిన వర్గాల పిల్లల కోసం రూ.10 లక్షల రుణం సాయం. 
జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్ పెంపు
వైన్స్ టెండర్లలో గౌడ్స్ రిజర్వేషన్ మరింత పెంపు