హైదరాబాద్: అధికార పార్టీ బీఆర్ఎస్ ఇదివరకే 110 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చింది. మంగళవారం నాడు 9 మంది అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చారు. పార్టీ అభ్యర్థులకు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, మంత్రి కె.తారక రామారావు (KTR) బి ఫారాలు అందచేశారు. దాంతో బీఆర్ఎస్ 119 మంది అభ్యర్థులకు బీ ఫారాలు అందిచ్చినట్లయింది. మజ్లిస్ పోటీ చేసే పాతబస్తీ స్థానాలతో పాటు అలంపూర్ సీటుకు సంబంధి బీ ఫారాల ప్రక్రియ పూర్తి చేశారు.


ఎం సీతారాంరెడ్డి - చాంద్రాయణ గుట్ట 
సామా సుందర్ రెడ్డి - యాకత్ పురా
ఇనాయత్ అలీబాక్రి - బహదూర్ పురా
తీగల అజిత్ రెడ్డి - మలక్ పేట్
అయిందాల కృష్ణ -  కార్వాన్ 
సలావుద్దీన్ లోడి - చార్మినార్
సి.హెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ - నాంపల్లి 
నందకిషోర్ వ్యాస్ - గోషామహల్
విజేయుడు - అలంపూర్ నియోజకవర్గాల అభ్యర్థులకు కేటీఆర్ బీ ఫారాలు అందజేశారు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాల ప్రక్రియ పూర్తయింది.


అలంపూర్‌ అభ్యర్థిని మార్చిన కేసీఆర్..
కాంగ్రెస్ పార్టీ తరహాలోనే బీఆర్ఎస్ సైతం అభ్యర్థిని మార్చింది. కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాలో వనపర్తి, బోధ్ అభ్యర్థులను మార్చడం తెలిసిందే. నేడు అలంపూర్ అభ్యర్థిని సైతం బీఆర్ఎస్ మార్చింది. ఆగస్టులో కేసీఆర్ అలంపూర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్రహాంకు టికెట్‌ ప్రకటించారు. కానీ తాజాగా బీ ఫారం ఆయనకు ఇవ్వకుండా ట్విస్ట్ ఇచ్చారు కేసీఆర్. ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి మద్దతు తెలిపిన కోడెదూడ విజయుడుకు ఛాన్స్ ఇచ్చారు. అలంపూర్‌ బీఫామ్‌ ను అబ్రహంకు కాకుండా విజయుడుకు ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మార్చినట్లైంది. విజయుడుతో పాటు మొత్తం 9 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు బీ ఫారాలు అందుకున్నారు.