AICC appoints cluster incharges:
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ అధిష్టానం క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకులను ప్రకటించింది. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) చేసిన ప్రతిపాదనలకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదం తెలిపారు. మొత్తం 10 మంది క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లతో పాటు 48 మందిని నియోజకవర్గాల పరిశీలకులుగా నియమించారు. క్లస్టర్ ఇంఛార్జ్ లు, నియోజకవర్గాల పరిశీలకుల నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.