వరంగల్ సీపీగా అంబర్ కిషోర్ ఝా

వరంగల్ పోలీస్ కమిషనర్ సీపీ ఏవీ రంగనాథ్ ను ఎన్నికల కమిషన్ బదిలీ చేయగా.. ఆయన స్థానంలో అంబర్ కిషోర్ ఝాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది. అంబర్ కిషోర్ ఝా గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రూరల్ ఎస్పీగా పని చేశారు.

భూపాలపల్లి ఎస్పీగా ఖారే కిరణ్ ప్రభాకర్భూపాల్ పల్లి జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న పుల్ల కర్ణాకర్ ను ఈసీ బదిలీ చేయగా.. ఆయన స్థానంలో  2017 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన  ఖారే కిరణ్ ప్రభాకర్ ను నూతన ఎస్పీగా నియమించింది. ఖారే కిరణ్ ప్రభాకర్ హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు.

ఇతర ప్రాంతాల్లో ఐఏఎస్‌లు వీరే..

రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ - వాణీ ప్రసాద్‌ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి - సునీల్‌ శర్మఎక్సైజ్‌ కమిషనర్‌ - జ్యోతి బుద్ధప్రకాశ్‌వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ - క్రిస్టినారంగారెడ్డి కలెక్టర్‌ - భారతీ హోలీకేరిమేడ్చల్‌ కలెక్టర్‌ - గౌతంయాదాద్రి కలెక్టర్‌ - హనుమంత్‌నిర్మల్‌ కలెక్టర్‌ - ఆశీష్‌ సంగ్వాన్‌

ఐపీఎస్‌లు వీరే..నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ - కల్మేశ్వర్‌నాగర్‌ కర్నూల్‌ ఎస్పీ - వైభవ్‌ రఘునాథ్‌సంగారెడ్డి ఎస్పీ - చెన్నూరి రూపేష్‌జోగులాంబ గద్వాల్ ఎస్పీ - రితిరాజ్‌జగిత్యాల ఎస్పీ - సంప్రీత్‌ సింగ్‌మహబూబాబాద్‌ ఎస్పీ - పాటిల్‌ పంగ్రామ్‌సింగ్‌ గణపతిరావ్‌నారాయణపేట్‌ ఎస్పీ - యోగేష్‌ గౌతమ్‌కామారెడ్డి ఎస్పీ - సింధూ శర్మమహబూబ్‌నగర్‌ ఎస్పీ - హర్ష వర్థన్‌భూపాలపల్లి ఎస్పీ - కిరణ్‌ ప్రభాకర్‌సూర్యాపేట ఎస్పీ - రాహుల్‌ హెగ్డే