Telangana Election 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి టీజేఎస్ పూర్తి మద్దతు తెలిపింది.  హైదరాబాద్‌ నాంప్లలిలోని టీజేఎస్ కార్యాలయంలో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంతో.. టీపీసీసీ అధ్యక్షుడు  రేవంత్‌రెడ్డి , తెలంగాణ కాంగ్రెస్ వ్యవహాల ఇంచార్జ్ థాక్రే సమావేశం అయ్యారు.  ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేసేందుకు ఇరుపార్టీలు అంగీకరానికి వచ్చాయి. ఈమేరకు ఇంతకుముందే రాహుల్‌ గాంధీతో.. కోదండరాం సమావేశమయ్యారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు ఆయన అంగీకరించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి మద్దతు తెలపాలని కోదండరాంను రేవంత్‌రెడ్డి కోరారు. ఈ మేరకు కోదండరాం అంగీకరించారు. ఎన్నికల్లో టీజేఎస్ పోటీ చేయడం లేదు. 


తెలంగాణ ఉద్యమ కాలంలో జేఏసీని ఏర్పాటు చేసి ఉద్యమాన్ని కోదండరాం ముందుండి నడిపించారని రేవంత్  రెడ్డి చర్చల తర్వాత అన్నారు.  ఇప్పుడు కూడా తెలంగాణ అభివృద్ధి కోసం వారి సంపూర్ణ మద్దతు కోరామని... రెండు పార్టీలూ కలిసి పనిచేసేందుకు ఓ సమన్వయ కమిటీ వేస్తామన్నారు.   ప్రభుత్వంలో ఆయన సేవల్ని భాగస్వామ్యం చేస్తామని... డిసెంబర్ 9న కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసి, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.   


 ఆలోచనలు, అభిప్రాయాలు, కర్తవ్యాలను పంచుకున్నామని..  బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ 9న్నర ఏళ్ల నిరంకుశ పాలనను ఓడించడానికి.. కలిసి సాగేందుకు ఆమోదం తెలిపామని కోదండరాంతెలిపారు.  ప్రజా పరిపాలన, ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చేందుకు కలిసి సాగుతాం. ఇందుకోసం ఉమ్మడి అవగాహనకు త్వరలో వస్తామని ప్రకటించారు.  ఈ సందర్భంగా  కోదండరాం కాంగ్రెస్   ముందు 6 ప్రతిపాదనలు పెట్తారు.  అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగాలు కల్పించాలని ...  చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు న్యాయం చెయ్యాలని కోరారు.   సంప్రదాయ వృత్తుల వారికీ, చిన్న సన్నకారు రైతులకు ఆదాయ భద్రత కల్పించాలని ...రాజ్యాంగ విలువలతో అన్ని వర్గాల వారికీ అభివృద్ధి జరగాలనీ, ఉద్యమ కారుల సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చెయ్యాలని కోరామన్నారు.  ఇందుకు రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారని  కోదండరామ్ తెలిపారు.
 
ఇటీవల తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీతో  కరీంనగర్ వీ పార్క్ హోటల్ లో కోదండరామ్ భేటీ అయ్యారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని రాహుల్ కోరినట్లు చెప్పారు.  తెలంగాణలో నిరంకుశ పాలన పోవాలనే అభిప్రాయాన్ని రాహుల్ వ్యక్తం చేసినట్లు కోదండరాం తెలిపారు. తెలంగాణలో నిరంకుశ పాలన పోవాలన్న తన అభిప్రాయంతో రాహుల్ ఏకీభవించినట్లు తెలిపారు.          


కోదండరాం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు. ఆయన కేసీఆర్ విబేధించారు. తర్వాత తెలంగాణ జన సమితి పార్టీని ప్రారంభించారు. ఆ పార్టీ అనుకున్నతంగా సక్సె్స్ కాలేదు. పార్టీలో చేరిన వారిలో తర్వాత చాలా మంది బయటకు వెళ్లిపోయారు. గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా పోటీ చేసినా ప్రయోజనం లేకపోయిది. ఈ ఎన్నికల్లో కోదండరాం ఎక్కడో ఓ చోట పోటీ చేయాలనుకున్నా..  సాధ్యం కాలేదు. చివరికి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. .కాంగ్రెస్‌కు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు.