Telangana Congress List :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  ఎన్నికలకు సిద్ధమవుతోంది.  అభ్యర్థులను ఖరారు చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. బుధ, గురువారాల్లో వరుసగా స్క్రనింగ్ కమిటీ సమావేశం అయింది.   టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా స్క్రీనింగ్ కమిటీ సమవేశాలకు  హాజరవుతున్నారు. ఢిల్లీలో  ఏఐసీసీ కార్యాలయంలో గురువారం మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమవేశం అయింది. ఈ భేటీ సుదీర్ఘంగాసాగే అవకాశం ఉంది.  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే కూడా ఈ సమావేశంలో పాల్గొనన్నారు. 


పుంగనూరు ఘటనల్లో అందరికీ బెయిల్ - చంద్రబాబు పిటిషన్‌పై శుక్రవారం విచారణ !


టీపీసీసీ పొలిటికల్ అపైర్స్ కమిటీ సూచించిన జాబితాను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి అభ్యర్థులను ఖరారు చేయనుంది. అభ్యర్థుల జాబితాను సిద్దం చేసిన తర్వాత పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపనుంది. కేంద్ర ఎన్నికల కమిటీ జాబితాను పరిశీలించి అధిష్టానానికి పంపనుంది. అనంతరం హైకమాండ్ అభ్యర్థులను ఫైనల్ చేయనుంది. వివిధ సర్వే రిపోర్టులు, నియోజకవర్గాల్లోని స్థానిక పరిస్థితులు, సామాజిక సమీకరణాలను అంచనా వేసి అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు. ఈ నెలాఖరు కల్లా తొలి జాబితాను సిద్దం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. దసరా కల్లా 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఫైనల్ చేయనుందని తెలుస్తోంది.                                             


తెలంగాణ కాంగ్రెస్ లో గతంలోలా పరిస్థితులు లేకుండా సీనియర్ నేతలందర్నీ లైన్లో పెడుతున్నారు. ఎన్నికలకు సంబంధించి కమిటీల్లో ప్రాధాన్యం దక్కడం లేదని ఫీలవుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీలకు తాజాగా… స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పించారు.. ఇటీవల వారిద్దరూ… అసంతృప్తిగా ఉంటున్నారు. వెంటనే.. పరిస్థితిని చక్కదిద్దేందుకు స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పించారు.   మరో వైపు బుస్సు యాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేసింది. పార్టీ ముఖ్య నేతలతో ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి చేపట్టాలని ప్రాథమికంగా తీర్మానించిన నేతలు.. తేదీలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఈ బస్సు యాత్రలో సీనియర్లు అందరూ పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందని.. స్థిరమైన పాలన అందిస్తామని ప్రజలకు నమ్మకం కలిగేలా ఈ యాత్ర ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లో అసంతృప్త స్వరాలు తగ్గిపోయాయి. పెద్దగా పార్టీకి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడటం లేదు.


ఈనెల 24వ తేదీన కాచిగూడ-యశ్వంత్ పూర్ వందేభారత్ రైలు ప్రారంభం


రేవంత్ రెడ్డి పూర్తిగా డామినేట్ చేస్తున్నారన్న విమర్శలు, అలకలు ఉన్నప్పటికీ… .ఆయనకు పూర్తిగా చార్జ్ ఇవ్వలేదని… హైకమాండ్ ఆలోచనతోనే అన్నీ జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్న సంకేతాలు కూడా గట్టిగా పంపడంతో.. కాంగ్రెస్ లో పరిస్థితి లైన్ లోకి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.