Telangana Elections 2023: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం మూడో జాబితాను ప్రకటించింది. ఈ జాబితాను 16 మందితో విడుదల చేశారు. కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి బరిలో ఉండగా, సీఎం కేసీఆర్ పైనే పోటీకి దిగుతున్నారు. ఈ మూడో జాబితాలో 16 మంది అభ్యర్థులను ప్రకటించగా.. మిర్యాలగూడ, సూర్యాపేట, తుంగతుర్తి, చార్మినార్ స్థానాలను ఇంకా పెండింగ్ లో ఉంచారు. బోథ్, వనపర్తి స్థానాల్లో అభ్యర్థులను మార్చింది.
16 మంది అభ్యర్థులు వీరే
కామారెడ్డి - రేవంత్ రెడ్డి
నిజామాబాద్ అర్బన్ - మహ్మద్ షబ్బీర్ అలీ
అశ్వారావు పేట (ఎస్టీ) - జారే ఆదినారాయణ
నారాయణఖేడ్ - సురేష్ కుమార్ షెట్కార్
చెన్నూరు (ఎస్సీ) - జి.వివేకానంద
బోథ్ (ఎస్టీ) - ఆదే గజేందర్
జుక్కల్ (ఎస్సీ) - తోట లక్ష్మీకాంతరావు
బాన్సువాడ - ఏనుగు రవీందర్ రెడ్డి
కరీంనగర్ - పురుమళ్ల శ్రీనివాస్
పటాన్ చెరు - నీలం మధు ముదిరాజ్
సిరిసిల్ల - కొండం కరుణ మహేందర్ రెడ్డి
వనపర్తి - తుడి మేఘారెడ్డి
డోర్నకల్ (ఎస్టీ) - డాక్టర్ జాతోథ్ రామచంద్రుడు నాయక్
ఇల్లందు (ఎస్టీ) - కోరం కనకయ్య
వైరా (ఎస్టీ) - మాలోత్ రామదాస్
సత్తుపల్లి (ఎస్సీ) - డాక్టర్ మట్టా రాగమయి