Dalita Dandora Live Updates: టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతా.. దళిత, గిరిజన దండోరా సభలో రేవంత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో కాంగ్రెస్ దళిత దండోరా సభ..
ABP Desam Last Updated: 18 Aug 2021 07:15 PM
Background
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో దళిత దండోరాను నిర్వహించింది. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను మోగించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆగస్టు 18న రంగారెడ్డి...More
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 9న ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో దళిత దండోరాను నిర్వహించింది. దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరాను మోగించనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆగస్టు 18న రంగారెడ్డి జిల్లాలో మరో దళిత దండోరా సభ పెట్టబోతున్నట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అప్పుడే ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి వేదికగా జరిగిన దళిత, గిరిజన దండోరా సభలోనే ఈ విషయాన్ని చెప్పారు. కార్యకర్తలను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామని.. ఈ సభ నాయకుల విజయం కాదని... కార్యకర్తల కమిట్‌మెంట్ అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
ప్రగతి భవన్ లో పిడుగు పడ్డది.. కేసీఆర్ గుండెల్లో గునపం దిగింది
సోనియా గాంధీ నిర్ణయంతో ప్రగతి భవన్ లో పిడుగు పడ్డది.. కేసీఆర్ గుండెల్లో గునపం దిగిందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల రోజుల నుంచి ఆగం ఆగం అవుతున్నారన్నారు. దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలు, కాదని.. విద్య ఉపాధి కావాలని రేవంత్ అన్నారు. 10 లక్షలు దేనికి సరిపోతాయని అడిగారు.