Telangana Teacher Promotions:
టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్ లపై కేసీఆర్ గ్రీన్ సిగ్నల్
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు షెడ్యూల్ విడుదల చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీచేశారు. టీచర్ల ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్ లపై మరో రెండు, మూడు రోజుల్లో సంబంధించి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డిలతో ఉద్యోగ సంఘాల సమావేశంలో తమ ఇబ్బందులు, సమస్యలతో పాటు పలు విజ్ఞప్తులు చేశారు. వీటిపై సానుకూలంగా స్పందించిన మంత్రులు సీఎం కేసీఆర్ తో చర్చించి టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రాష్ట్రంలో 9 వేల 266 మంది ఉపాధ్యాయులకు ప్రమోషన్స్, బదిలీలు కానున్నాయి. ముందుగా హెడ్ మాస్టర్ ల బదిలీలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్లను వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పారదర్శకంగా చేయనున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఒకవేళ ఇప్పుడు బదిలీలు, పదోన్నతులు చేసినా, విద్యా సంవత్సరం ముగిసిన తరవాత ఏప్రిల్ లో రిలీవింగ్ చేయనున్నామని సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ ఇచ్చారు.
గ్రూప్-1' మెయిన్స్ పరీక్ష విధానం, సిలబస్ పూర్తి వివరాలు ఇలా!
తెలంగాణలో 503 గ్రూప్-1 పోస్టుల కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 13న విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోస్టుల సంఖ్యకు 1:50 నిష్పత్తిలో మొత్తం 25,050 మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేసింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. పరీక్ష షెడ్యూలును జనవరి 18 నుంచి కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.
'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షల్లో 6 ప్రధాన సబ్జెక్టులతో పాటు జనరల్ ఇంగ్లిష్ క్వాలిఫైయింగ్ పరీక్ష ఉంటుంది. ఈ క్వాలిఫైయింగ్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మాత్రమే మిగతా 6 పేపర్లను మాత్రమే పరిగణలోకి తీసుకొని పేపర్ల మూల్యాంకనం చేస్తారు. క్వాలిఫయింగ్ టెస్టు 150 మార్కులకు ఉంటుంది. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. ఇది కేవలం క్వాలిఫయింగ్ టెస్టు మాత్రమే. ఈ మార్కులను మెయిన్స్ పరీక్షల్లో (6 పేపర్లు) సాధించిన మొత్తం మార్కులలో మాత్రం కలపరు. పరీక్ష సమయం రెండున్నర గంటలు. మెయిన్స్ పరీక్షల్లో నిర్వహించే మొత్తం 6 పేపర్లలో.. ప్రతి పేపర్‌కు 150 మార్కుల చొప్పున 900 మార్కులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ప్రతి పేపర్‌లో మూడు వ్యాసాలను రాయాల్సి ఉంటుంది. మూడు సెక్షన్లలలో ప్రతి సెక్షన్ నుండి 1 వ్యాసరూప సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతి సమాధానానికి 50 మార్కుల చొప్పున 150 మార్కులు ఉండనున్నాయి. ఒక్కో పేపరుకు 3 గంటల సమయం ఉంటుంది.