తెలంగాణ కొత్త సచివాలయం భవనంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత‌న జ‌రిగిన రాష్ట్ర మంత్రి వ‌ర్గ స‌మావేశం ముగిసింది. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ప్రారంభ‌మైన స‌మావేశం మూడు గంటల పాటు సాయంత్రం 6:15 గంట‌ల వ‌ర‌కు సాగింది. దాదాపు మూడు గంట‌ల‌కు పైగా మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో రాష్ట్ర ఆవిర్భావ ద‌శాబ్ది వేడుక‌ల‌తో పాటు ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు. ఈ స‌మావేశానికి మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి శాంతి కుమారితో పాటు ప‌లు శాఖ‌ల ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.




మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ తదితరులు విలేకరుల సమావేశం నిర్వహించి వివరించారు.


కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవీ..
111జీవో పరిధిలో ఉన్న 84 గ్రామాలకు ఎలాంటి ఆంక్షలు ఇకనుంచి ఉండవు


* ఈ గ్రామాల చుట్టూ రింగ్ మైన్ ను నిర్మాణం చేయాలని కేబినెట్ నిర్ణయం.


* కాళేశ్వరం జలాలను మూసి, గండిపేట కు లింక్ చేయాలని నిర్ణయం.


* హుస్సేన్ సాగర్ కు రానున్న రోజుల్లో గోదావరి జలాలు.


హెల్త్ డిపార్ట్మెంట్


* 33 జిల్లాల్లో DMHO పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం.


* హైదరాబాద్ నగరానికి 6 DMHO లను నియమించాలని నిర్ణయం.


* హైదరాబాద్ నగరంలో జోన్ల వారిగా DMHO ల నియామకం.


కొత్తగా ఏర్పడిన 40 మండలాల్లో ప్రైమరీ హెల్త్ కేర్ ను పెట్టాలని కేబినెట్ నిర్ణయం.


* అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లలో పర్మినెంట్ ఉద్యోగులను నియమించాలని కేబినెట్ నిర్ణయం.


వ్యవసాయ రంగం


వ్యవసాయ రంగంలో మార్పు తెచ్చేనెదుకు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కమిటీ వేసిన కేబినెట్



దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం


* 21 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల్లో ఉత్సవాలు జరపాలి


* ఒక్కో రోజు ఒక్కో రంగంపై ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది.


కుల వృత్తులకు ఆర్థిక సాయం చేయడానికి సబ్ కమిటీ వేసిన కేబినెట్


* ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం


* బీసీ బంధు ప్రకటించిన కేబినెట్


111జీవో ను పూర్తిగా ఎత్తివేస్తూ కేబినెట్ నిర్ణయం


* నకిలీ విత్తనాల మీద ఉక్కుపాదం మోపాలని కేబినెట్ నిర్ణయం.


* ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే పీడి యాక్ట్ పెట్టాలని కేబినెట్ ఆదేశం.


* మక్కలు, జొన్నలు కొనేందుకు కేబినెట్ నిర్ణయం.


* ఉమామహేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ స్కిమ్ పేజ్ 1, 2 కేబినెట్ నిర్ణయం.


* VRA లను రేగులరైజ్ చేసేందుకు కేబినెట్ నిర్ణయం.


* రొండో విడత గొర్రెల పంపిణీకి కేబినెట్ నిర్ణయం.


* వనపర్తి లో జర్నలిస్ట్ భవనానికి, ఖమ్మంలో 23 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం.


* మైనార్టీ కమిషన్ లో జైన్ కమ్యూనిటిని చేర్చాలని కేబినెట్ నిర్ణయం.


* TSPSC లో 10 పోస్టులను కొత్తగా భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయం.