Breaking News Live:ఆదోని మండలంలో దారుణం, రెండేళ్ల బాలుణ్ని బావిలో పడేసిన దుండగులు

Breaking News Live: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 15 Mar 2022 05:46 PM
ఆదోని మండలంలో దారుణం, రెండేళ్ల బాలుణ్ని బావిలో పడేసిన దుండగులు

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరులో దారుణం జరిగింది. రెండేళ్ల బాలుడు నర్సింహులును ఇంటి వద్ద ఉన్న బావిలో పడేసి చంపేశారు దుండగులు. నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదంటూ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారించిన పోలీసులు డెడ్‌బాడీని వెలికి తీశారు. విగత జీవుడిగా పడిఉన్న కుమారుడిని చూసి ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

ఎంత ఖర్చయినా, ఉక్రెయిన్ నుంచి వచ్చిన వారి ఎంబీబీఎస్ పూర్తయ్యేలా చూస్తాం: కేసీఆర్

ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల భవిష్యత్ పై అసెంబ్లీలో కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. యుద్ధం జరుగుతోన్న ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను సొంత ప్రాంతాలకు తీసుకొచ్చాం, ఇప్పుడు వారి పరిస్థితి ఏంటి అని ఆందోళన నెలకొంది. అయితే ఎంత ఖర్చయినా సరే వారి ఎంబీబీఎస్ పూర్తయ్యేలా చూస్తామని కేసీఆర్ ప్రకటించారు.

బడ్జెట్ అంటే బ్రహ్మ పదార్థం కాదు, శాఖలకు ఖర్చుల వివరాలు: అసెంబ్లీలో సీఎం కేసీఆర్

ప్రజాస్వామ్యం పరిణితి చెందే క్రమంలో చట్టసభల్లో జరిగే చర్చలు కూడా ఇంప్రూవ్ కావాలని, భవిష్యత్‌లో దేశాన్ని రాష్ట్రాన్ని నడిపే నాయకత్వం ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ చివరిరోజు సభలో కేసీఆర్ ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడారు.ఈ బడ్జెట్‌ అంటే బ్రహ్మపదార్థం అన్నట్టు మన దేశంలో ఉంటుంది. ఇందులో రెండు విషయాలు గమనించాలి. అధికారం ప్రవేశపెడితే... అధికార పక్షం పొగుడుతూ ఉంటుంది. ప్రతిపక్షం తిడుతుంది. దశాబ్దాలుగా నడుస్తున్నది ఇదే. సీట్లు మారినప్పుడు ఇదే ధోరణి.  వాళ్లకు ఇవి చాలా ఉపయోగపడతాయి. కొన్ని అలవాట్లు వచ్చేశాయన్నారు. 


బడ్జెట్ అనేది నిధుల కూర్పు అని తెలుసుకోవాలి. సమకూరిన నిధులు ఎలా ఖర్చుపెట్టాలన్నదే డిస్కషన్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అదే దారిలో ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. మన మొదటి బడ్జెట్‌ వంద కోట్లు. ప్రైవేటు బడ్జెట్‌ బ్యాంకు బ్యాలెన్స్‌, ఆదాయంపై అది ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ బడ్జెట్‌ అలా కాదు. మొదట ప్లాన్ వేస్తారు. వివిధ శాఖలకు ఎంత ఖర్చు పెట్టాలనే లెక్కలు రెడీ చేస్తారు. ఆ లెక్క ప్రకారమే నిధులు కూర్పు జరుగుతుందని పేర్కొన్నారు.

Kurnool News: కర్నూలు జిల్లాలో వేటకొడవళ్లతో ఓ వ్యక్తి పై దాడి

Kurnool News: కర్నూలు జిల్లా డోన్ మండలంలో కర్నూల్ రైల్వే గేట్ సమీపంలో వేటకొడవళ్లతో ఓ వ్యక్తి పై దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని డోన్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడిని మల్కాపురం గ్రామానికి చెందిన బోయశేఖర్‌గా గుర్తించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

TDP MLAs Suspend: ఏపీ అసెంబ్లీ నుంచి మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు ఒక్కరోజు సస్పెండ్

TDP MLAs Suspend: ఏపీ అసెంబ్లీ నుంచి మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారామ్ నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఐదుగురు ఎమ్మెల్యేలను పూర్తి సెషన్ నుంచి సస్పెండ్ చేయగా.. నేడు సభ సజావుగా సాగకుండా అడ్డు పడుతున్నారని టీడీపీ మిగతా ఎమ్మెల్యేలపై ఒక్కరోజు సస్పెన్షన్ వేటు వేశారు. జంగారెడ్డిగూడెం ఘటనపై నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం, సభ జరగకుండా అడ్డుకోవడంతో టీడీపీ సభ్యుల్ని ఒక్కరోజు సస్పెండ్ చేశారు.

బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీలోకి అనుమతించని స్పీకర్

సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలకు మరోసారి నిరాశే ఎదురైంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీతో ఎమ్మెల్యేలు నేటి ఉదయం ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావు అసెంబ్లీకి చేరుకున్నారు. తామను సమావేశాలకు అనుమతించాలని అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కోరారు. ఈ మేరకు కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని సమర్పించారు. కానీ స్పీకర్ ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను సమావేశాలకు అనుమతించడానికి నిరాకరించారు.

Suspended BJP MLAs: కోర్టు ఆదేశాలతో స్పీకర్‌ను కలిసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు

Suspended BJP MLAs: ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సభా హక్కులు ఉల్లంఘనకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు డివిజన్ బెంచ్ సోమవారం అభిప్రాయపడింది. వారిని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అనుమతించాలని కోర్టు ఆదేశాలతో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజా సింగ్, ఈటల రాజేందర్ కలిశారు. 

Jangareddigudem Deaths: లోకేష్ ఆధ్వర్యంలో రెండో రోజు టీడీపీ నేతల నిరసన

Jangareddigudem Deaths: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన రెండవ రోజుకు చేరుకుంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన కల్తీసారా మరణాలన్నీ సీఎం జగన్ చేసిన హత్యలంటూ టీడీపీ ప్రజాప్రతినిధులు నిరసన చేపట్టారు. నకిలీ బ్రాండ్ల భాగోతం వెలికితీయాలంటూ నిరసన ప్రదర్శనకు దిగారు. మద్యపాన నిషేధం ఏమైందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి టీడీపీ శాసనసభ పక్షం నిరసన ర్యాలీ చేపట్టింది.

Telangana Budget Sessions: నేటితో ముగియనున్న తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

Telangana Budget Sessions: నేటితో తెలంగాణలో బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి.  ఇవాళ 2022–23 ఆర్థిక సంవ‌త్స‌రా‌నికిగానూ ద్రవ్యవినిమయ బిల్లును మంగ‌ళ‌వారం అసెం‌బ్లీలో ప్రవే‌శ‌పె‌ట్ట‌ను‌న్నారు. ఉభయసభల్లో దీనిపై చర్చజరగనుంది. మార్చి 7న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. ప్రారంభానికి ముందే వివాదానికి కేంద్ర బిందువుగా మారడం తెలిసిందే. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలుపెట్టినా, అధికార టీఆర్ఎస్ మాత్రం తమదైన శైలిలో సమావేశాలను నిర్వహిస్తోంది.

Background

Telangana Budget Sessions: నేటితో తెలంగాణలో బడ్జెట్‌ సమావేశాలు ముగియనున్నాయి.  ఇవాళ 2022–23 ఆర్థిక సంవ‌త్స‌రా‌నికిగానూ ద్రవ్యవినిమయ బిల్లును మంగ‌ళ‌వారం అసెం‌బ్లీలో ప్రవే‌శ‌పె‌ట్ట‌ను‌న్నారు. ఉభయసభల్లో దీనిపై చర్చజరగనుంది. మార్చి 7న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. ప్రారంభానికి ముందే వివాదానికి కేంద్ర బిందువుగా మారడం తెలిసిందే. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం లేకుండానే తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీనిపై ప్రతిపక్షాలు గగ్గోలుపెట్టినా, అధికార టీఆర్ఎస్ మాత్రం తమదైన శైలిలో సమావేశాలను నిర్వహిస్తోంది.


హైదరాబాద్‌లో ఇంధన ధరలు గత ఏడాది డిసెంబర్ నుంచి నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు సైతం పెట్రోల్ ధర లీటర్ (Petrol Price Today 15th March 2022) రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 105 డాలర్లకు దిగొచ్చింది. ఢిల్లీలోనూ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. 


తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) పెరిగింది.  వరంగల్‌లో 19 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.107.88 కాగా, డీజిల్‌‌పై 17 పైసలు పుంజుకోవడంతో లీటర్ ధర రూ.94.31 కు పతనమైంది. 
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.107.84 కాగా, డీజిల్‌‌ పై 6 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.28 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) కాస్త తగ్గాయి. 15 పైసలు తగ్గడంతో కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.107.92 కాగా, 14 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.94.35 గా ఉంది.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 15th March 2022)పై 18 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.61 కాగా, ఇక్కడ డీజిల్ పై 17 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.68 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.05 అయింది. డీజిల్‌పై 44 పైసలు పెరిగి లీటర్ ధర రూ.95.18గా ఉంది.


ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలు నమోదు అవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.  ఏపీ, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలులు వేగంగా వీస్తున్నాయి. దీని ప్రభావంతో ఏపీలో వాతావరణం మరికొన్ని రోజులపాటు పొడిగా మారుతుంది. ఓ వైపు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నా, రాత్రి వేళల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నాయి.


ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న బలమైన వేడిగాలుల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉభయ గోదావరి జిల్లాల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది.  


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పగటి పూట వేడి అధికంగా ఉంటుంది. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న వేడి గాలుల ప్రభావంతో ప్రకాశం, కర్నూలు, గుంటూరు, చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఉక్కపోత ఎక్కువ అవుతుంది. రోజుకు కనీసం 5 లీటర్ల వరకు మంచి నీళ్లు తాగాలని అధికారులు సూచించారు. 


తెలంగాణ వెదర్ అప్‌డేట్
తెలంగాణలోనూ వేడి, ఉక్కపోత రోజురోజుకూ పెరిగిపోతోంది. రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాలైన సూర్యాపేట​, మహబూబాబాద్, నల్గొండ​, భద్రాద్రి, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల​, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.


మార్చి నెలలో కనిష్ట ధరల్ని నమోదు చేసింది బంగారం. హైదరాబాద్ మార్కెట్‌లో రూ.340 మేర తగ్గడంతో తాజాగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,100 అయింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.52,470 కి క్షీణించింది. స్వచ్ఛమైన వెండి ధర రూ.500 మేర పతనమైంది. నేడు హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.74,200 కు పడిపోయింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు ముందు కేజీ వెండి ధర దేశంలో రూ.68 వేలుగా ఉండేది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.