Bandi Sanjay Son:   తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు ఓ విద్యార్థిని కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బండి సంజయ్ కుమారుడి పేరు సాయి భగీరథ్‌. హైదరాబాద్‌లోని మహింద్రా యూనివర్శిటీలో చదువుతున్న  సాయి భగీరధ్.. ఓ జూనియర్ విద్యార్థిని చితకబాదారు. ఈ వీడియోను కూడా తోటి విద్యార్థులు చిత్రీకరించారు. అయితే ఈ దాడి ర్యాగింగ్ కారణంగా చేశారా.. మరో వివాదమా అన్నదానిపై స్పష్టత లేదు.  మహీంద్రా యూనివర్సిటీ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.



వీడియోలో ఉన్న బండి సంజయ్ కుమారుడు కావడంతో ఈ అంశం రాజకీయ వివాదమయింది. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. బండి సంజయ్ కుమారుడు ర్యాగింగ్ పేరుతో దాడి చేశారని చర్యలు తీసుకుంటారా అని బీజేపీ జాతీయ స్థాయి నేతలను ట్యాగ్ చేసి ప్రశ్నిస్తున్నారు. 






 





 అయితే దాడికి గురైన యువకుడి వీడియో అంటూ.. మరో వీడియోను బీజేపీ మద్దతుదారులు వైరల్ చేస్తున్నారు. తానే ఓ అమ్మాయిని ఏడిపించానని..అందుకే బండి సంజయ్ కొడుకు కొట్టాడని... ఆ యువకుడు చెప్పుకున్నాడు. 





ఈ రెండు వీడియోలతో అటు బీఆర్ఎస్ నేతలు.. ఇటు బీజేపీ నేతలు ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గామారింది.