మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు నేలపై తెలియని వారంటూ ఉండరు. సామాన్యుల నుంచి మొదలుకొని సెలబ్రిటీల దాకా ఆయనంటే ఎంతో మంది ఇష్టపడేవారు ఉన్నారు. సినిమా పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన నటుడు ఆయన. చిరంజీవితో సినిమాలు చేయాలని దర్శక, నిర్మాతలు ఎదురు చూస్తే, ఆయనతో కలిసి నటించాలని ఎంతో మంది నటీనటులు కలలు కంటుంటారు. అంతటి క్రేజ్ ఉన్న చిరంజీవి మెసేజ్ చేసినా యాంకర్ సుమ పట్టించుకోలేదట. కనీసం రిప్లై కూడా ఇవ్వలేదట. ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవే చెప్పారు. 


చిరు లీక్స్ తో షాకైన సుమ!


యాంకర్ సుమ బర్త్ డే సందర్భంగా గత మూడు సంవత్సరాలుగా ఆమెకు శుభాకాంక్షలు చెప్తూ మెసేజ్ లు పెడుతున్నారట. కానీ, తను రిప్లై ఇవ్వలేదని తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహరాజ రవితేజ, శృతి హాసన్ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ డూపర్ హిట్ అందుకుంది. ఈ సందర్భంగా సుమ హోస్ట్ చేస్తున్న ‘సుమ అడ్డా’ షోలో పాల్గొన్నారు. చిరంజీవితో పాటు దర్శకుడు బాబీ, కమెడియన్ వెన్నెల కిశోర్ సైతం ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమ, చిరంజీవిని ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అగింది. చిరు లీక్స్ ఏమైనా ఉంటే చెప్పాలని కోరింది.       


మెసేజ్ పెట్టినా సుమ పట్టించుకోలేదు- చిరంజీవి


వెంటనే చిరంజీవి సుమ షాక్ అయ్యే విషయాన్ని చెప్పారు. చిరు లీక్స్ లో ఇప్పుడు సుమ గురించే ఓ విషయాన్ని లీక్ చేయబోతున్నానంటూ అసలు విషయం చెప్పారు. “గత మూడు, నాలుగు సంవత్సరాలుగా సుమ బర్త్ డే సందర్భంగా ఆమెకు విషెస్ చెప్తూ మెసేజ్ లు పెడుతున్నాను. కానీ, ఆమె ఆ మెసేజ్ లను కనీస్ పట్టించుకోలేదు. ఈ ప్రపంచంలో చిరంజీవి మెసేజ్ చేసినా రిప్లై ఇవ్వని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే? అది సుమ మాత్రమే” అంటూ చిరంజీవి వెల్లడించారు.


చిరంజీవి దగ్గరి నుంచి మెసేజ్ వస్తుందని ఊహించలేదు- సుమ


చిరంజీవి ఈ విషయం చెప్పడంతో సుమ బదులు ఇచ్చింది. “చిరంజీవి గారి దగ్గరి నుంచి మెసేజ్ వస్తుందని తాను అస్సలు ఊహించలేదని చెప్పింది. కనీసం నెంబర్ కూడా చెక్ చేసుకోలేదని వెల్లడించింది. కానీ, ఓ ఈవెంట్ లో చిరంజీవి గారు కలిసి ఈ విషయాన్ని చెప్పడంతో తాను ఎంతో సంతోషించానని వెల్లడించింది. అప్పుడు సారీ చెప్పి తన నంబర్ తీసుకున్నట్లు చెప్పింది.






Read Also: 3 రోజుల్లో రూ.108 కోట్లు రాబట్టిన ‘వాల్తేరు వీరయ్య’ - మరి ‘వీరసింహా రెడ్డి’?