Remand For Bandi Sanjay : టెన్త్ పేపర్ల లీకేజీకి కుట్ర పన్నారని పోలీసులు అరెస్ట్ చేసిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు హన్మకొండ కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. అర్థరాత్రి కరీంనగర్‌లోని అత్తగారిఇంట్లో ఉన్న బండి సంజయ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ తీసుకు వచ్చారు. ఈ మధ్యాహ్నం హన్మకొండకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు ప్రవేశ పెట్టారు. రిమాండ్ రిపోర్టులో పేపర్ లీకేజీ కుట్ర పన్నారని అభియోగాలు నమోదు చేశారు. అయితే ఇదంతా రాజకీయ కుట్ర అని.. ఎంతో మంది ఫోన్లు చేస్తూ ఉంటారని అందులో కుట్ర ఉందని ఎలా అంటారని.. ఆయనతరపు న్యాయవాదులు కోర్టులో వాదించినా ప్రయోజనం లేకపోయింది. బండి సంజయ్ కు జడ్జి 14 రోజులు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనను కరీంనగర్ జైలుకు తరలిస్తున్నారు. కోర్టు వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
టెన్త్ పేపర్ లీక్ కేసు రిమాండ్ రిపోర్టులో బండి సంజయ్‌ను ఏ1గా చేర్చారు. ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సురేశ్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శార్మిక్, ఏ10గా పోతబోయిన వసంత్ పేర్లను చేర్చారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్ పీఏ, ఇతరలు చాలామందికి పంపారని సీపీ రంగనాథ్ చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు.
బండి సంజయ్ తమకు ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని, కానీ ఆయన ఇవ్వడం లేదన్నారు సీపీ. బండి సంజయ్, ప్రశాంత్ మధ్య పలు కాల్స్, చాట్స్ జరిగినట్లుగా సీపీ తెలిపారు. బండి సంజయ్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగిందన్నారు. బండి సంజయ్ అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చినట్లు సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
నిందితుడు బూర ప్రశాంత్ గతంలో జర్నలిస్టుగా పనిచేశాడని, ప్రస్తుతం అతనికి ఏ మీడియా సంస్థతో సంబంధం లేదని సీపీ రంగనాథ్ స్పష్టం చేశారు. బయటకు వచ్చిన పేపర్ ఫోటోను బండి సంజయ్ సహా ఈటల రాజేందర్ పీఏ, ఇతరలు చాలామందికి పంపారని సీపీ రంగనాథ్ చెప్పారు. పేపర్ ను ప్లాన్ ప్రకారమే షేర్ చేస్తున్నారని తెలిపారు. బండి సంజయ్ తమకు ఫోన్ ఇస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయని, కానీ ఆయన ఇవ్వడం లేదన్నారు.
బండి సంజయ్, ప్రశాంత్ మధ్య పలు కాల్స్, చాట్స్ జరిగినట్లుగా సీపీ తెలిపారు. బండి సంజయ్ డైరక్షన్ లోనే ఇదంతా జరిగిందని ఆయన తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరిగిందని సీపీ రంగనాథ్ తెలిపారు. బండి సంజయ్ అరెస్టుపై లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చినట్లు వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.