Telangana Assembly Live Updates: విద్యుత్‌ సవరణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ

Advertisement

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేడు (సెప్టెంబరు 12) ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి. సభలో జరిగే అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇక్కడ చూడవచ్చు.

ABP Desam Last Updated: 12 Sep 2022 12:01 PM
KCR Speech: కనీస విద్యుత్ వినియోగం జరగడం లేదు - కేసీఆర్

‘‘మన దేశంలో స్థాపిత విద్యుచ్ఛక్తి 4,07,178 మెగావాట్లు. బేస్ పవర్ లోడ్ 2,42,890 మెగావాట్లుగా ఉంది. ఈ దేశం అత్యధికంగా విద్యుత్ వినియోగించింది.. 2,10,793 మెగావాట్లు మాత్రమే. ఇటీవలే జూన్ 22న ఇది నమోదైంది. బేస్ పవర్ లోడ్ అంటే కనీస విద్యుత్ వినియోగాన్ని కూడా మన దేశంలో వినియోగించడం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే’’

Continues below advertisement
KCR Speech: హిట్లరే కాలగర్భంలో కలిసిపోయాడు - కేసీఆర్

‘‘వ్యవసాయం తన వల్ల కాదని రైతులు చేతులెత్తేసే కుట్ర జరుగుతోంది. ధాన్యం కొనాలని అడిగితే కాదంటున్నారు. వీళ్లు కాలగర్భంలో కలిసి పోతారు. భరతమాత గుండెకు గాయం అవుతోంది. అంటే వీరికి పోయే కాలం వచ్చింది. షిండేలు, బొండేలు ఎంత మంది వచ్చినా ఎవరు భయపడరు. హిట్లర్ లాంటి వాడే కాలగర్భంలో కలిసిపోయాడు’’ అని కేసీఆర్ శాసనసభలో మాట్లాడారు.

Background

Telangana Assembly Live Updates: గత మంగళవారం (సెప్టెంబరు 6) తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ కాసేపట్లోనే వాయిదా పడింది. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలిపిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్ధన్ రెడ్డిల మృతికి  తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. అనంతరం తమ శాఖల సంబంధించిన నివేదికను తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ నెల 12వ తేదీకి అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ అసెంబ్లీ సమావేశాలలో పురపాలక చట్ట సవరణ సహా 6 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.


కాంగ్రెస్‌కు తగ్గిన ఓ ఎమ్మెల్యే.. 
తెలంగాణ అసెంబ్లీ ప్రారంభానికి ముందే సీఎల్పీ సమావేశం జరిగింది. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎల్పీ భేటీలో చర్చించారు. బీఎసీ సమావేశం తర్వాత మరోసారి సమావేశం కావాలని సీఎల్పీ నిర్ణయించింది. గత అసెంబ్లీ సమావేశాలతో పోల్చితే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఒక ఎమ్మెల్యే తగ్గారు. మునుగోడు నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఎమ్మెల్యే పదవితో పాటు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి సమర్పించగా, కొంత సమాయానికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా లేఖను ఆయను ఆమోదించారు. 


ఉదయం 11:30 గంటలకు ప్రారంభం, అంతలోనే సభ వాయిదా 
తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11:30 గంటలకు ప్రారంభమయ్యాయి. అనంతరం ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, జనార్ధన్ రెడ్డిల మృతికి తెలంగాణ అసెంబ్లీ సంతాపం తెలిపింది. అసెంబ్లీని 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ సమావేశాలలో భాగంగా తెలంగాణ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజన్సీస్ రూల్స్ 2022 బిల్లును రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ సభలో ప్రవేశ పెట్టనున్నారు. మరోవైపు ఈ సమావేశాల్లో ప్యానెల్ స్పీకర్లుగా  రెడ్యా నాయక్, మోజం ఖాన్, హనుమంత్ షిండేల పేర్లను స్పీకర్ పోచారం ప్రకటించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఎసీ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకొంటారు.


గోదావరి వరదలపై శాసనమండలిలో చర్చ..
ఇటీవల కురిసిన వర్షాలు, గోదావరి వరదలతో జరిగిన నష్టంపై శాసనమండలిలో చర్చ మొదలైంది. వరదల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను టీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి వివరించారు. సీఎం కేసీఆర్ సైతం ఈ ప్రాంతానికి వచ్చి స్వయంగా పరిశీలించారని గుర్తుచేశారు. భద్రాచలం ప్రాంతాల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్ల రూపాయాలు కేటాయించినట్లు చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా సాయం అందలేదని మండలిలో వెల్లడించారు.

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.