Breaking News 24 September: సీఎం జగన్ దిల్లీ టూర్ రద్దు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 24న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 24 Sep 2021 08:06 PM

Background

Breaking News 24 September Live Updates: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 24న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ...More

దివ్యాంగురాలిపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్టు

విశాఖ జిల్లాలో దివ్యాంగురాలిపై అత్యాచారం చేసిన వైసీపీ నాయ‌కుడ్ని పోలీసులు శుక్ర‌వారం అరెస్ట్ చేశారు. సీలేరుకు చెందిన దివ్యాంగ మ‌హిళ‌పై ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12 గంట‌ల స‌మ‌యంలో అదే గ్రామానికి చెందిన నాళ్ల‌ వెంక‌ట‌రావు(40) అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఒడిశా రాష్ట్రంలోకి త‌ప్పించుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుండ‌గా సీలేరు జ‌లాశ‌యం వ‌ద్ద చాక‌చ‌క్యంగా ప‌ట్టుకున్నార‌ు. నాళ్లవెంకటరావును అరెస్ట్ చేసి, వైద్య ప‌రీక్ష‌ల కోసం విశాఖ‌ప‌ట్నం కేజీహెచ్‌కు త‌ర‌లించారు. న‌ర్సీప‌ట్నం కోర్టులో హాజ‌రుప‌రిచినట్లు గూడెం కొత్తవీధి సీఐ అశోక్‌ కుమార్ తెలిపారు.