Breaking News Live: పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 24న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 24 Oct 2021 07:27 PM

Background

హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. నేతల మధ్య డైలాగ్స్ పేలుతున్నాయి. మీ రెండు పార్టీలు కుమ్మక్కైయ్యాయి.. లేదు మీ రెండు పార్టీలే కుమ్మక్కైయ్యాయని మాటకి మాట బదులిస్తున్నారు. ఈటల రాజేందర్ బీజీపీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి అని మంత్రి కేటీఆర్...More

పిడుగుపాటుకు ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి

అనంతపురం జిల్లా  పిడుగుపాటుతో ఇద్దరు గొర్రెల కాపర్లు మృతి చెందారు. బ్రహ్మ సముద్రం మండలం బొమ్మగానీపల్లి  గ్రామానికి చెందిన గాటు తిమ్మన్న (70), మోహన్ నాయక్ (44) పిడుగుపాటుకు మరణించారు. వర్షం కారణంగా ఇద్దరు ఓ చెట్టుకిందకు వెళ్లారు. ఆ సమయంలో పిడుగుపాటుకు గురై మృతి చెందారు.