Telangana Micro Brewery Policy: తెలంగాణ ప్రభుత్వం మైక్రో బ్రూవరీలను ప్రమోట్ చేసేందుకు 'మైక్రోబ్రూవరీ-25' పాలసీని ప్రకటించింది. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఈ పాలసీని అమలు చేస్తున్నారు, దీని ద్వారా గ్రేటర్ హైదరాబాద్ బయట కూడా మైక్రో బ్రూవరీలు స్థాపించే అవకాశం కల్పించారు. ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి సారి ఇలాంటి విస్తృత పాలసీ, దీని ద్వారా క్రాఫ్ట్ బీర్ కల్చర్‌ను విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ పాలసీ ద్వారా బీర్ ప్రేమికులకు ఫ్రెష్ బ్రూడ్ బీర్‌ను హోటల్స్, రెస్టారెంట్స్, బార్స్, క్లబ్స్, టూరిజం స్పాట్స్ వంటి ప్రదేశాల్లో అందుబాటు చేయడం లక్ష్యం. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రమే 18 మైక్రో బ్రూవరీలు ఉండగా, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరణకు మార్గం సుగమం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల కన్స్యూమర్లకు మరిన్ని ఆప్షన్స్ లభించడంతో పాటు, టూరిజం , ఎకనామీకి బూస్ట్ ఇవ్వాలని ఉద్దేశం. మైక్రో బ్రూవరీలు ఏటా 15,000 బ్యారెల్స్ కంటే తక్కువ బీర్ ప్రొడ్యూస్ చేసే చిన్న యూనిట్లుగా చెప్పుకోవచ్చు.
అప్లికేషన్లు సెప్టెంబర్ 3 నుండి 25 వరకు సబ్మిట్ చేయవచ్చు. ఇంట్రెస్టెడ్ పార్టీలు Form MB-1Aలో అప్లై చేయాలి, రూ.1 లక్ష నాన్-రిఫండబుల్ ఫీ చెల్లించాలి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (TCUR) – బోడుప్పల్, జవహర్‌నగర్, పీర్జాదిగూడ, నిజాంపేట్, బడంగ్‌పేట్, బండ్లగూడ జాగీర్, మీర్‌పేట్ వంటి ప్రాంతాల్లో అప్లికేషన్లు ఎక్సైజ్ కమిషనర్ ఆఫీస్‌లో సబ్మిట్ చేయాలి. కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, అదిలాబాద్, వరంగల్ వంటి ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో సంబంధిత డిప్యూటీ కమిషనర్ ఆఫీస్‌లో అప్లై చేయాలి. మరిన్ని గైడ్‌లైన్స్ కోసం tgbcl.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
మైక్రో బ్రూవరీ సెటప్ చేయడానికి కనీసం 1,000 చదరపు అడుగుల స్పేస్ అవసరం. ఇవి 2B బార్స్, ఎలైట్ బార్స్, C1 క్లబ్స్, TD1, TD2 లైసెన్స్‌డ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్, హోటల్స్, రెస్టారెంట్స్‌లో సెటప్ చేయవచ్చు. రెసిడెన్షియల్ ఏరియాల్లో కూడా అనుమతి ఉంది, కెపాసిటీ 1,000 లీటర్లు వరకు. అప్లికెంట్స్ సంబంధిత డిపార్ట్‌మెంట్ల నుండి అనుమతి సర్టిఫికెట్లు పొందాలి.
అప్లికేషన్ ఫీతో పాటు, లైసెన్స్ ఫీస్ గురించి స్పష్టమైన వివరాలు లేవు, కానీ పాలసీ అమెండ్‌మెంట్స్ ద్వారా రెగ్యులేషన్లు సడలించారు. ప్రభుత్వం రెవెన్యూ పెంచుకోవడానికి ఈ పాలసీని భాగంగా చూస్తోంది.
ఈ పాలసీతో టూరిజం స్పాట్స్‌లో ఫ్రెష్ బీర్ అందుబాటు కావడంతో ఎకనామీ బూస్ట్ అవుతుందని అంచనా. మందు బాబులు లిక్కర్ షాపులపై ఆధారపడకుండా హోటల్స్‌లోనే బీర్ ఆర్డర్ చేయవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలు పెరగడం, క్రాఫ్ట్ బీర్ ఇండస్ట్రీ వృద్ధి జరగవచ్చు.
ఈ పాలసీ మంచిదా కాదా అన్నదానిపై చాలా విశ్లేషణలు ఉన్నాయి కానీ... ఇలాంటి వ్యాపార అవకాశాల గురించి వెదికే యువతకు మాత్రం మంచి అవకాశం అనుకోవచ్చు. గతంలో బీర్ తయారీపై పలు సినిమాలు వచ్చాయి. వెబ్ సిరీస్‌లు కూడా వచ్చాయి.