Breaking News Live: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగుబాటు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 20న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 20 Oct 2021 08:36 PM

Background

యాదాద్రి ఆలయం విమాన గోపురానికి తిరుమల తరహాలో బంగారు తాపడం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీని కోసం 125 కిలోల బంగారం అవసరమవుతుందన్నారు. యాదాద్రికి తొలి విరాళంగా  తమ కుటుంబం నుంచి కిలో 16 తులాల బంగారం ఇస్తున్నట్లు కేసీఆర్...More

చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగుబాటు

చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ సునీల్ దత్ శర్మ మరియు సీఆర్పీఎఫ్ అధికారుల ముందు 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీలో చురుకుగా పనిచేసేవారు ఒకేసారి భారీ సంఖ్యలో లొంగిపోవడం మావోయిస్టులకు గట్టి దెబ్బగా చెప్పవచ్చు. లొంగిపోయిన వారిలో ఒక మావోయిస్ట్ పై లక్ష రూపాయలవరకు రివార్డు ఉండగా.. మిగతా మావోయిస్టులలలో కొందరిపై రూ.10 వేల రివార్డు ఉంది. వీరంతా కుకనార్ గాడిరాస్, పుల్బాజీ, చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు చెందినవారని ఎస్పీ తెలిపారు.