Breaking News: మద్యం దుకాణాల్లో రిజర్వేషన్లు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 21న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 21 Sep 2021 08:04 PM

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 21న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి....More

పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటన

ఏపీ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. వచ్చే నెల 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మొత్తం 6 రోజులు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 9 రెండో శనివారం, 10 ఆదివారం, 17వ తేదీ ఆదివారం కావడంతో మొత్తం 9 రోజులు దసరా సెలవులు. తిరిగి పాఠశాలలను 18వ తేదీన తెరుస్తారు.