Breaking News Live Updates: మాజీ క్రికెటర్ యువరాజ్ అరెస్ట్... బెయిల్ పై విడుదల..!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 17న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 17 Oct 2021 10:31 PM
రేపు శ్రీవారిని దర్శించుకోనున్న మా అధ్యక్షుడు మంచు విష్ణు

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు, మంచు లక్ష్మీ. రేణిగుంట విమానాశ్రయం వద్ద వీరికి అభిమానులు పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు బయలుదేరారు. ఇవాళ రాత్రి తిరుమలలో బస చేసి రేపు ఉదయం వీ.ఐ.పీ విరామ సమయంలో మా ఫ్యానల్ సభ్యులతో కలిసి మా అధ్యక్షుడు మంచు విష్ణు స్వామి వారిని దర్శించుకోనున్నారు..

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులో ఒకరు చనిపోయగా, రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 3,938కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 3,924 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 176 మంది కరోనాను జయించారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

నిద్రపోతున్న బాలుడిని కాటేసిన పాము

తెలంగాణ జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఇందిరమ్మ కాలనిలో పాముకాటుతో సమీర్ అనే రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇంట్లో నిద్రిస్తున్న బాలుడిని ఆదివారం తెల్లవారుజామున పాముకాటు వేసింది. బాలుడు ఏడువడంతో గమనించిన తల్లిదండ్రులు బాలుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ముందస్తు ఎన్నికల అంశంపై నేతలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్లారిటీ

తెలంగాణ భవన్ లో పార్లమెంటరీ పార్టీ ఎల్పీ సంయుక్త  సమావేశం ముగిసింది. ఈ సారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని సమావేశంలో టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తెలిపారు. ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాల  సమయం ఉందని.. చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయన్నారు. మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా కష్టపడి  పనిచేయాలని నేతలకు కేసీఆర్ సూచించారు. ఈ నెల 27 హుజురాబాద్ లో కేసీఆర్ ప్రచార సభ.. కాగా హుజురాబాద్ ఉప ఎన్ని కల్లో తామే గెలుస్తామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

విశాఖ ఏజెన్సీలో పోలీసులపై గంజాయి ముఠా రాళ్ల దాడి

విశాఖ ఏజెన్సీలో గంజాయి ముఠా పోలీసులపై దాడికి దిగింది. పోలీసులపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో పోలీసులు 10 రౌండ్ల కాల్పులు చేసినట్లు తెలుస్తోంది. 

ముగిసిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం

తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం ముగిసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని కేసీఆర్ అన్నారు. 10 లక్షల మందితో వరంగల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 

ఏపీలో కొత్తగా 432 కరోనా కేసులు, 5 మరణాలు

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 432 కరోనా కేసులు, 5 మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 586 మంది కరోనా నుంచి కోలుకున్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 6,034 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. 

ప్రారంభమైన టీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సమావేశం

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్​లో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ అధ్యక్షతన  శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త సమావేశం ప్రారంభమైంది. సంస్థాగత ఎన్నికలు, సర్వసభ్య సమావేశం, ప్లీనరీపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. నవంబరు 15న వరంగల్ లో విజయగర్జన సభ నిర్వహణపై చర్చించనున్నారు. పార్టీ పురోగతిపై సీఎం నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. 

తిరుపతి-దిల్లీ మధ్య స్పైస్ జెట్ విమాన సేవలు ప్రారంభం

తిరుపతి- దిల్లీ మధ్య స్పైస్ జెట్ విమాన సర్వీసును కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ విమాన సర్వీస్ ఆధ్యాత్మిక రాజధానిని, జాతీయ రాజధానితో కలుపుతుందని మంత్రి అన్నారు. 





తిరుపతి - ఢిల్లీ మధ్య స్పైస్ జెట్ విమానాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి సింధియా

తిరుపతి - ఢిల్లీ మధ్య స్పైస్ జెట్ విమానాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. ఈ విమాన సర్వీస్ ఆధ్యాత్మిక నగరాన్ని, దేశ రాజధానితో కలుపుతుంది. 

సీమనేతల సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ

అనంతపురం జిల్లా హిందూపురం జేవీస్ ఫంక్షన్ హాల్లో జరిగిన సీమనేతల సదస్సులో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై సీమ నేతల సదస్సులో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేసి ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. హిందూపురం పార్లమెంట్ అధ్యక్షులు బి.కె పార్థసారథి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ  గుండుమల తిప్పేస్వామి, అనంతపురం జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు కాలువ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్,  రాయలసీమకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. 

సిగరెట్టు ఉద్దెర ఇవ్వలేదని షాపు యజమానిపై దాడి

తెలంగాణ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పూసాలలో కిరాణా షాప్ లో సిగరేటు ఉద్దెర ఇవ్వనందుకు ఓ యువకుడు గొడుగుతో షాపు యజమాని పడల ప్రసాద్ పై దాడిచేశాడు. ఈ దాడిలో షాపు యజమాని  గొంతుకు గాయమయ్యింది. అడ్డుగా వచ్చిన షాపు యజమాని కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. వెంటనే గమనించిన స్థానికులు ప్రసాద్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


 

ప్రారంభమైన అలయ్.. బలయ్, పవన్ కల్యాణ్ హాజరు

‘దత్తన్న అలయ్ బలయ్’ కార్యక్రమం నెక్లెస్ రోడ్‌లోని జలవిహార్‌లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు కలుసుకున్నారు. కాసేపటి కిందటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. తెలంగాణ గవవర్నర్ తమిళిసై, ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అలయ్ బలయ్‌ కార్యక్రమానికి వస్తున్నారు. దసరా తర్వాత ఒకరినొకరు కలుసుకోవడం, ఆలింగనం చేసుకోవడం ఈ అలయ్ బలయ్ కార్యక్రమం ప్రత్యేకత.

మరికాసేపట్లో జలవిహార్‌లో అలయ్ బలయ్

ఏటా దసరా మరుసటి రోజు నిర్వహించే ‘దత్తన్న అలయ్ బలయ్’ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఒకే వేదికపై అన్ని పార్టీల నేతలు ప్రముఖులు కలుసుకోనున్నారు. ఈ సారి అలయ్ బలయ్‌కి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. తెలంగాణ గవవర్నర్ తమిళిసై, ఏపీ గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అలయ్ బలయ్‌ కార్యక్రమానికి వస్తున్నారు. అంతేకాక, తెలుగు రాష్ట్రాల మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సినీ ప్రముఖులు, కవులు కూడా హాజరవుతారు. అలయ్ బలయ్‌లో తెలంగాణ సంసృతి ఉట్టిపడే కళాకారుల నృత్యాలతోపాటు తెలంగాణ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేశారు.

శ్రీవారి సేవలో ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యేలు

తిరుమల శ్రీవారిని తెలంగాణ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందజేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామనాయుడు కూడా స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

శ్రీవారి సేవలో సినీ నటి శ్రీదేవి విజయ్ కుమార్

తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీదేవి విజయ్ కుమార్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు సమర్పించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Background

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 17న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.