Breaking News Live: ఈటల రాజేందర్ పై కేసు నమోదు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 11న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
హుజురాబాద్ లో రాజకీయాలు వేడెక్కుతున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లఘించి సభ నిర్వహించారని ఫ్లైయింగ్ స్వ్కాడ్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తిరుమల శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ పంచకట్టుతో శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించారు. గరుడ వాహన సేవలో పాల్గొనున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్దకు చేరుకున్నా సీఎం జగన్ కు టీటీడీ అధికారులు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం చేశారు. మరి కాసేపట్లో శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
హెటిరో సంస్థల్లో ఐటీ సోదాలు జరిగాయి. హైదరాబాద్ లో 30 ప్లాట్లల్లో అట్టపెట్టెల్లో డబ్బు దాచారని ఐటీ అధికారులు తెలిపారు. ఆరు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు దాడులు చేసినట్లు ఆదాయపు పన్ను అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో లెక్కల్లో లేని భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
లఖింపుర్ ఖేరి కేసులో నిందితుడుగా ఉన్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను మూడు రోజుల పోలీస్ రిమాండ్‌కు తరలించారు. కొన్ని షరతులతో రిమాండ్‌కు ఇచ్చారని అడ్వకేట్ ఎస్పీ యాదవ్ తెలిపారు.
చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్ కు మంత్రులు,అధికారులు ఘనస్వాగతం పలికారు. రేణిగుంట నుంచి రోడ్డు మార్గంలో సీఎం తిరుపతికి చేరుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం ఆసుపత్రిని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అలిపిరి శ్రీవారి పాదాల వద్ద మెట్ల మార్గం, గో మందిరాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఆ తరవాత రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని బేడి ఆంజనేయస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం సంప్రదాయ వస్త్రధారణలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పంది. 6 పరీక్షలు మాత్రమే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 11 పేపర్లు ఉండేవి ఈ ఏడాది 6 పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్కో సబ్జెక్టుకు ఒకే పరీక్ష నిర్వహించాలన్నారు.
ఈ ఏడాది ఆర్థికశాస్త్రంలో డేవిడ్ కార్డ్, జాషువా డీ యాంగ్రిస్ట్, గైడో డబ్ల్యూ ఇంబెన్స్ను నోబెల్ బహుమతి వరించింది.
బద్వేలు ఉప ఎన్నికల బరిలో 18 మంది నిలిచారు. నామినేషన్ల పరిశీలనలో భాగంగా 9 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. బద్వేలు ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, బీజేపీ సహా స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం త్రిదండి శ్రీ చినజీయర్ స్వామిని కలిశారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌కు కుటుంబ సమేతంగా కేసీఆర్ వెళ్లారు. చినజీయర్ ఆశ్రమంలో సతీమణి శోభ, కుటుంబసభ్యులు స్వామిని కలిశారు. యాదాద్రి కొత్త ఆలయం ప్రారంభంపై చినజీయర్ స్వామితో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు కేసీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులను చినజీయర్ శాలువాతో సత్కరించారు.
తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని ఓ వ్యక్తి చనిపోయారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాళ్ళకల్ గ్రామంలో నివాసం ఉంటున్న 50 ఏళ్ల నర్సింహా రెడ్డి అనే వ్యక్తి రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తూ స్పీకర్ కాన్వాయ్ ఢీకొంది.
హన్మకొండ అర్బన్: నూతనంగా ఏర్పడిన కలెక్టర్ భవన్ వద్ద పిట్టల తిరుపతమ్మ, కావేరి అనే ఇద్దరు మహిళల ఆందోళన బాట పట్టారు. తమ భూమిని ఇతరులు కబ్జా చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులను ఆశ్రయించినా కూడా సమస్యలు పరిష్కారం కాలేదని కలెక్టర్ భవనం ఎక్కి వారు పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని శాంతింప జేసి అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
నెల్లూరులో సెల్ ఫోన్ షాపులో జరిగిన అగ్నిప్రమాదంలో ఫోన్లన్నీ కాలిబూడిదయ్యాయి. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. నగరం నడిబొడ్డున ఉన్న లస్సీ సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది. అయితే పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేయడంతో.. చుట్టు పక్కల ఉన్న దుకాణాలకు అవి వ్యాపించలేదు. ఈ ప్రమాదంలో 15 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్టు బాధితులు చెబుతున్నారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం దాఖలైన నామినేషన్లను ఎన్నికల అధికారులు నేడు పరిశీలిస్తున్నారు. మొత్తం 61 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. అధికారుల నామినేషన్ల పరిశీలన తర్వాత ఎన్ని తిరస్కరణకు గురవుతాయన్న ఆసక్తి నెలకొని ఉంది. సమస్యలు పరిష్కరించాలని నిరసన వ్యక్తం చేస్తూ 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. స్క్రూటినీలో ఎందరు ఊడతారో.. ఎవరు బరిలో నిలుస్తారో అని ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ నెల 13న నామినేషన్ల ఉపసంహరణ ఉండగా.. అనంతరం తుది జాబితాను ప్రకటిస్తారు.
ఇందిరా పార్క్ వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో తెలంగాణ పీసీసీ మౌన దీక్ష ప్రారంభం అయింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని లఖీమ్ పూర్‌లో దీక్ష చేస్తున్న రైతులపై నుంచి కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు తన కార్లతో తొక్కించి హత్య చేసిన సంఘటనకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ ఈ దీక్ష చేపట్టింది. ఆజయ్ మిశ్రాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ దీక్షలో రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యక్రమాల చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, పీఏసీ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘‘నాకు ‘మా’తో 21 ఏళ్ల అనుబంధం ఉంది. కోటా శ్రీనివాసరావు, రఘుబాబు, రవిబాబు లాంటివారు నన్ను నాన్ లోకల్ అన్నారు. వారి వ్యాఖ్యలను నేను గౌరవిస్తాను. అందుకే ఇకపై తెలుగు పరిశ్రమకు అతిథిగానే ఉంటాను. నేను తెలుగు చిత్ర పరిశ్రమకు అతిథిగానే వచ్చాను.. ఇకపై కూడా అలాగే ఉంటాను. నేను మా అసోసియేషన్‌ను మాత్రమే వదిలాను. పరిశ్రమను వదల్లేదు. ఇలాంటి మనస్తత్వం ఉన్న అసోసియేషన్‌లో నేను ఉండలేను. ఈ నిర్ణయాన్ని ఓడిపోయాననే బాధతో తీసుకోలేదు. మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నాను. ఈ ఎన్నికల్లో మంచు విష్ణు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుంటున్నాను.’’ అని ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ‘మా’ ఐడీ కార్డును మీడియాకు చూపించారు.
మా ఎన్నికలు ఎప్పుడూ లేని చైతన్యంతో బాగా జరిగాయని ప్రకాశ్ రాజ్ అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరున అభినందనలు తెలిపారు. తాను తెలుగోడ్ని కాదని, ప్రాంతీయత అనే విమర్శలు మొదలుపెట్టారని ప్రకాశ్ రాజ్ అన్నారు. తన తల్లిదండ్రులు తెలుగువాళ్లు కాదని.. అది ఎవరి తప్పు కాదని అన్నారు. ‘‘ఒక తెలుగు బిడ్డనే, మంచి వ్యక్తినే మీరు ఎన్నుకున్నారు. కానీ, ఒక కళాకారుడిగా నాకూ ఆత్మగౌరవం ఉంటుంది. అందుకే మా సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఈ మా ఫలితాలను నేను స్వాగతిస్తాను.’’ అని ప్రకాశ్ రాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు.
నెల్లూరులో సెల్ ఫోన్ షాపులో జరిగిన అగ్నిప్రమాదంలో ఫోన్లన్నీ కాలిబూడిదయ్యాయి. అర్థరాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. నగరం నడిబొడ్డున ఉన్న లస్సీ సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది. అయితే పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పివేయడంతో.. చుట్టు పక్కల ఉన్న దుకాణాలకు అవి వ్యాపించలేదు. ఈ ప్రమాదంలో 15లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించినట్టు బాధితులు చెబుతున్నారు.
నెల్లూరు నగరం ట్రంక్ రోడ్డు లస్సి సెంటర్ లో షార్ట్ సర్క్యూట్ తో అఖిల్ మొబైల్స్ దుకాణం కాలిపోయింది. దాదాపుగా 15 లక్షల అఖిల్ మొబైల్స్ తో పాటు ఇక్కడ కిళ్లీ దుకాణాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత ఈ ప్రమాదం సంభవించింది. పక్కన ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించకుండా నెల్లూరు అగ్నిమాపక శాఖ స్టేషన్ ఫైర్ అధికారి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. దుకాణ యజమాని శ్రీనివాసులు రెడ్డి ప్రమాదం జరిగిందని సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకొని ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణంలో ఉన్న 50 వేల నగదు తో పాటు ఇతర సెల్ ఫోన్ వస్తువులు కాలిపోయాయని వివరించారు
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా హాజరయ్యారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీశ్ చంద్ర పదోన్నతిపై తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా రాష్ట్రపతి భవన్ నియమించిన సంగతి తెలిసిందే.
వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం గడిసింగాపూర్ సమీపంలో నేషనల్ హైవే 163పై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బైక్‌ను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బైక్‌పై ఉన్నవారు తాండూరుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. పొగమంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో అత్యంత పాశవికమైన ఘటన చోటు చేసుకుంది. ఓ కన్న తల్లి తన బిడ్డలకు ఉరి వేసి చంపేసింది. పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారని పిల్లల్ని చంపేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 11న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -