Supreme Court ordered Prabhakar Rao surrender to police: తెలంగాణ పోన్ ట్యాపింగ్ కేసులో మొదటి నిందితుడుగా ఉన్నా మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావుు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆయన శుక్రవారం జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ కావాలని ఆదేశించింది. కస్టోడియల్ విచారణ అవసరం అని తెలంగాణ పోలీసులు కోరారు. పధ్నాలుగు రోజుల పాటు విచారణకు కావాలని అడిగారు. గతంలో విచారణకు వచ్చినా.. సహకరించలేదని చెప్పారు. దాంతో సుప్రీంకోర్టు శుక్రవారం సరెండర్ కావాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. ఆయనను ఫిజికల్ గా టార్చర్ చేయవద్దని ఆదేశించింది. 

Continues below advertisement

మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) చీఫ్‌గా ఉన్న ప్రభాకర్ రావు, మునుపటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి  మేలు చేకూర్చేందుకు రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తలు,  జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారని పోలీసులు చెబుతున్నారు స్పెషల్ ఆపరేషన్స్ టీమ్  ను ప్రభాకర్ రావు, SIBలో  రాజకీయ నిఘా కోసమే ఏర్పాటు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.   ఈ టీమ్‌ను సస్పెండెడ్ DSP ప్రణీత్ రావు    ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి, 56 మంది సిబ్బందితో రాజకీయ వ్యతిరేకులను టార్గెట్  చేశారు. ఈ టీమ్‌ను ప్రభాకర్ రావు నేరుగా పర్యవేక్షణ చేశారని పోలీసులు చెబుతున్నారు.  టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం IGP ర్యాంక్ అధికారి మాత్రమే ట్యాపింగ్ ఆర్డర్లు జారీ చేయగలడు. కానీ, ప్రభాకర్ రావు CoO (చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్) పదవిలో IGP సమాన అధికారాలను ఉపయోగించి, వివిధ మార్గాల నుంచి పౌరుల ఫోన్‌లను ట్యాప్ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా గుర్తించారు. 

బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిని  టార్గెట్ చేసి, వారి సంభాషణలు, ప్రొఫైల్స్, డబ్బు బదిలీలు మొదలైనవి ట్రాక్ చేశారు. అరెస్ట్ అయిన అధికారుల ప్రణీత్ రావు, భుజంగ రావు, తిరుపతి అన్నా  కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ల ప్రకారం, ఈ ఆపరేషన్‌లు ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు జరిగాయి.  2023 డిసెంబర్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభాకర్ రావు SOT సిబ్బందికి రాజకీయ ప్రొఫైల్స్, హార్డ్ డిస్కులు, ఎలక్ట్రానిక్ డేటాను నాశనం చేయమని ఆదేశించాడు. తన ఇంట్లో కూడా అన్ని  సాక్ష్యాలను క్లీన్ చేసి అమెరికాకు వెళ్లారు. 

Continues below advertisement

కేసు నమోదు అయిన తర్వాత ఆయన ఇండియాకు రాలేదు.  పరారీలో ఉన్న నేరస్తుడిగా ప్రకటించాడనికి ఏర్పాట్లు పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి అరెస్టు కాకుండా .. విచారణకు హాజరయ్యేలా అంగీకరించిన తర్వాతనే వచ్చారు అప్పటికే ఆయన పాస్ పోర్టును రద్దు చేశారు. కొత్త పాస్ పోర్టును మంజూరు చేయించుకుని వచ్చారు. ప్రభాకర్ రావు 2025 జూన్‌లో అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పటికీ, iCloud అకౌంట్ల పాస్‌వర్డులు ఇవ్వడం, పూర్తి సహకారం చేయడం వంటి విషయాల్లో ఇంకా పూర్తిగా సహకరించడం లేదని పోలీసులు సుప్రీం కోర్టులో తెలిపారు. గతంలో పాస్ వర్డ్‌లు ఇవ్వాలని  సుప్రీంకోర్టు ఆదేశించంది. ఆయన సహకరించకపోవడంతో..  సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది.