Supreme Court: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కారుకు ఎదురు దెబ్బ తగిలింది. మూడో టీఎంసీ పనులపై సుప్రీం కోర్టు బుధువాకం స్టే విధించింది. పర్యావరణ అనుమతులు, డీపీఆర్ లేకుండా తెలంగాణ సర్కారు నిర్మిస్తోందంటూ ఓ పిటిషన్ దాఖలు అయింది. ఈ మేరకు పర్యావరణ అనుమతులు ఉన్నాయా.. అని సుప్రీం కోర్టు సర్కారును ప్రశ్నించింది. మూడో టీఎంసీ పనులపై స్టే విధిస్తున్నట్లు ప్రకటించింది. ఆపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు భూసేకరణపై యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 


రాష్ట్ర ప్రబుత్వం కౌంటర్ దాఖలు చేయాలి..


ఆగస్టు 23న తుది విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. పిటిషనర్లు రిజాయిండర్ కూడా దాఖలు చేయాలని పేర్కొంది. పరిహారం, భూసేకరణ, నిర్వాసితుల సమస్యలపై సుప్రీంకోర్టులో 6 వేర్వేరు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఆరు పిటిషన్లను ఈనెల 22న ఒకేసారి విచారణకు కోర్టు స్వీకరించింది. ఇప్పటికే కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 


ప్రాజెక్టు ముంపు మానవ తప్పిదమే...


గత నెలలో కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు మానవ తప్పిదమే అని విశ్రాంత ఇంజినీర్ లక్ష్మణ్ చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కాళేశ్వం నిర్మాణమే సక్రమంగా చేపట్టలేదని వివరించారు. వాస్తవానికి భిన్నంగా కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. ప్రభుత్వం ఎంతో గొప్పగా చెప్పుకునే కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలు విఫలం అయ్యాయని అన్నారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు విషయంలో ప్రకృతి వైపరీత్యానికి మానవ తప్పిదం తోడయ్యిందని చెప్పారు. కేవలం రెంపు పంపులు  మునిగే సరికి లక్ష కోట్లు మునిగాయి అనడం కరెక్ట్ కాదని చెప్పారు. 


కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విపక్షాల తీరు..


కాళేశ్వరం సీడబ్ల్యూసీ అన్ని అనుమతులు ఇచ్చిందని.. టెక్నికల్ గా ఎలాంటి తప్పిదాలు లేవని స్పష్టం చేశారు. అన్నారం పంపింగ్ స్టేజ్ 130 మీటర్ల వద్ద ఉంటే.. వరద 131 మీటర్ల వరకు వచ్చిందని శ్యాం ప్రసాద్ రెడ్డి పోర్కొన్నారు.  అలాగే ప్రతిపక్షాల నాయకులంతా కాళేశ్వరం ప్రాజెక్టు ముంపుకు కారణం సీఎం కేసీఆర్ యే అంటూ విమర్శించారు. ఇంజినీర్లు ఎంతగా చెప్పినా సీఎం కేసీఆర్ వినకపోవడం వల్లే ఈ సమస్యలు తలెత్తాయంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పలువురు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ధర్మాసనం విచారణ చేపట్టింది. మూడో టీఎంసీ నిర్మాణ పనులపై స్టే విధించి విచారణను ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేసింది.