Breaking News Telugu Live Updates:  కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు స్వర్ణం, మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ 

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

ABP Desam Last Updated: 30 Jul 2022 10:28 PM
 కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు స్వర్ణం, మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ 

Mirabai Chanu Wins Gold : కామన్వెల్త్ గేమ్స్ భారత్ స్వర్ణం సాధించింది. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. 

 కామెన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు స్వర్ణం, మీరాబాయి చానుకు గోల్డ్ మెడల్ 

Mirabai Chanu Wins Gold : కామెన్వెల్త్ గేమ్స్ భారత్ స్వర్ణం సాధించింది. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ లో మీరాబాయి చాను గోల్డ్ మెడల్ సాధించింది. దీంతో భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. 

తెనాలిలో రోడ్డు ప్రమాదం, లారీ ఢీకొని బాలుడు మృతి 

Tenali Road Accident : గుంటూరు జిల్లా తెనాలిలో రోడ్డు ప్రమాదం జరిగింది.  లారీ ఢీకొనటంతో బాలుడు మృతి చెందాడు. కావాలి గ్రామానికి చెందిన కొండయ్య 14 ఏళ్ల బాలుడు తెనాలిలో బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తన అక్కతో కలసి రోడ్డుపై యాచన‌‌ చేస్తుండగా లారీ ఢీకొట్టింది. మధ్యాహ్నం సమయంలో‌ యాచిస్తూ  కొత్త వంతెన నుంచి మార్కెట్ వెళ్లే మార్గంలో వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనటంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

ములుగులోని రైస్ మిల్లులో కూలీ అనుమానాస్పద మృతి

ములుగు జిల్లా : ములుగు (మం) జంగాల పల్లిలో ఓ రైస్ మిల్లులో బిహార్ కు చెందిన గుడ్డు అనే కూలీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రైస్ మిల్లులోని చెట్టుకు ఊరి వేసుకొని చనిపోయినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Jagtial: అధిక వడ్డీలతో ఫైనాన్స్ నడుపుతున్న ఇద్దరి అరెస్ట్

జగిత్యాల జిల్లా... కోరుట్ల సర్కిల్ పరిధిలో అధిక వడ్డీలతో అక్రమ ఫైనాన్స్ నడుపుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన కోరుట్ల పోలీసులు...


వారి వద్ద నుండి సుమారు 24 లక్షల రూపాయల నగదు, అప్పు పత్రాలు స్వాధీనం...

Nellore News: దివ్యాంగుడి ఆత్మహత్య.. నలుగురు పోలీసులను సస్పెండ్

నెల్లూరు జిల్లాలో ఇటీవల ఓ దివ్యాంగుడి ఆత్మహత్యకు కారణమయ్యారన్న ఆరోపణలతో నలుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. జిల్లా ఎస్పీ విజయరావు, సస్పెన్షన్ ఆర్డర్లు జారీ చేశారు. శాఖా పరమైన విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకున్నారు. మర్రిపాడు ఎస్‌.ఐ వెంకటరమణ, ఏఎస్‌ఐ జయరాజ్‌, కానిస్టేబుళ్లు ఎస్‌.కె చాంద్‌ బాషా, సంతోష్‌ కుమార్‌ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Crime News: గోదావరిలో దూకి కాకినాడ హోంగార్డు ఆత్మహత్య

కోనసీమ జిల్లా.. యానాం.. 
ఎదుర్లంక వారధిపై నుంచి గోదావరిలో దూకి హోంగార్డు ఆత్మహత్య.. 
కాకినాడ ఎస్.పి బ‌ంగళాలో హోమ్ గార్డుగా విధులను నిర్వహిస్తున్నట్లు సమాచారం.. 
ఇతని స్వస్థలం తాళ్ళరేవు మండలం పి.మల్లవరంగా గుర్తింపు...
గాలింపు చర్యలు చేపట్టిన ఐ పోలవరం పోలీసులు...

Monkey Pox Case In Guntur: గుంటూరులో మంకీ పాక్స్ అనుమానిత కేసు, 8 ఏళ్ల బాలుడిలో లక్షణాలు

గుంటూరు: గుంటూరులో మంకీ పాక్స్ అనుమానిత కేసు


ఒంటిపై దద్దుర్లతో జీజీహెచ్ లో చేరిన 8 ఏళ్ల బాలుడు 


రెండు వారాల క్రితం జీజీహెచ్ కు తెచ్చిన బాలుడి తల్లిదండ్రులు


ఒడిస్సా నుంచి ఉపాధి కోసం పల్నాడు జిల్లాకు వచ్చిన బాలుడి తల్లిదండ్రులు


నమూనాలు తీసి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపిన జీజీహెచ్ అధికారులు.

AP News: రెండు మృతదేహాలు వెలికితీత

అనకాపల్లి జిల్లా... అచ్యుతాపురంమండలం పూడిమడక బీచ్  ప్రమాద స్తలానికి చేరుకున్న జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది. 
 రెండు మృతదేహాలు ను హెలికాప్టర్ ద్వారా తీసుకుని తీసుకువచ్చారు. మరో మూడు మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు

Background

తూర్పు రాజస్థాన్ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉత్తర మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్ గఢ్, ఏపీలోని కోస్తా ప్రాంతం మీదుగా ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల, 3.1 కి.మీ ఎత్తు వరకు కొనసాగి బలహీనపడింది. ఉపరితల ఆవర్తనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్రప్రదేశ్ తీరంలో సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మరో మూడు, నాలుగు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించారు. రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా కొమొరిస్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడింది. భారీ వర్షాలతో ఏపీ, తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్‌లో శుక్రవారం సైతం భారీ వర్షం కురిసింది. నేడు సైతం నగరాన్ని మబ్బులు కమ్మేశాయి. తూర్పు, ఈశాన్య దిశల నుంచి గంటకు 6 నుంచి 12 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, నల్గొండ జిల్లాల్లో భారీ కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.


బులియన్ మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధరలు పెరిగాయి. మరోవైపు వెండి ధర భారీగా ఎగబాకింది. రూ.1,100 మేర పెరగడంతో హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.62,300 అయింది. రూ.110 పెరగడంతో నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490 అయింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,200 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. కరీంనగర్, వరంగల్‌లో 22 క్యారెట్ల ఆర్నమెంట్ ధర రూ.47,200 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,490కు చేరింది. వెండి కేజీ ధర రూ.62,300కి ఎగబాకింది.


హైదరాబాద్‌లో చాలా రోజుల నుంచి  ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో జూలై 30 (శనివారం) లీటర్ పెట్రోల్ ధర (Petrol Price Today 30 July 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు. 
తెలంగాణలో ఇంధన ధరలు..
నేడు వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్‌‌ లీటర్ ధర రూ.97.35 అయింది. 
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.39 కాగా, డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.97.55 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో ఇంధన ధరలు మారాయి. పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 30 July 2022) లీటర్ ధర రూ.111.33 కాగా, 18 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.99.12 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధర నిలకడగా ఉంది. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.88 అయింది. డీజిల్‌ లీటర్ ధర రూ.98.27 అయింది. చిత్తూరులో 39 పైసలు దిగొచ్చి పెట్రోల్ లీటర్ రూ.111.96 కాగా, డీజిల్ ధర సెంచరీ కొట్టింది. 37 పైసలు తగ్గడంతో చిత్తూరులో డీజిల్ లీటర్ ధర రూ.99.64 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. కర్నూలులో 60 పైసలు తగ్గడంతో పెట్రోల్ ధర రూ.111.64 కాగా, డీజిల్ ధర రూ. 99.40 అయింది. నెల్లూరులో పెట్రోల్ ధర రూ.111.16 కు చేరింది. డీజిల్ ధర రూ.98.90 అయింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.