Telangana defected MLAs inquiry: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్  బీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన ఎమ్మెల్యేల అనర్హతా  పిటిషన్ల విచారణ షెడ్యూల్‌ను శనివారం ఖరారు చేశారు. సెప్టెంబర్ 29న మధ్యాహ్నం 11 గంటలకు మొదలయ్యే విచారణలు అక్టోబర్ 1న కొనసాగుతాయి. టిషనర్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింత ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. రెస్పాండెంట్లుగా టి. ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), కాలే యదయ్య (చేవెళ్ల), గుడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (జోగులంబ గద్వాల్) ఉన్నారు. స్పీకర్ రెండు వైపులా వాదనలు విని, 10వ షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ సుప్రీం కోర్ట్ ఆదేశాలకు అనుగుణంగా జరుగుతోంది.

Continues below advertisement

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు 2024 మార్చి-ఏప్రిల్‌లో కాంగ్రెస్‌లోకి చేరారు. దానం నగేందర్ (ఖైరతాబాద్), బండ్లా కృష్ణమోహన్ రెడ్డి (గద్వాల్), కడియం శ్రీహరి (స్టేషన్ ఘన్‌పూర్), తెల్లం వెంకటరావు (భద్రాచలం), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్స్‌వాడ), కాలే యదయ్య (చేవెళ్ల), టి. ప్రకాశ్ గౌడ్ (రాజేంద్రనగర్), ఎం. సంజయ్ కుమార్ (జగిత్యాల), గుడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), అరెకపూడి గాంధీ (శేరిలింగంపల్లి).  ఈ ఫిరాయింపులపై  బీఆర్ఎస్ నేతలు కల్వకుంట్ల  సంజయ్, చింత ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి మొదలైనవారు స్పీకర్‌  వద్ద అనర్హతా  పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు.  

జూలై 31, 2025న సుప్రీం కోర్టు సిజేఐ బీఆర్ గవాయ్ బెంచ్  స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.  ఈ ఆదేశాలతో స్పీకర్  విచారణ మొదలుపెట్టారు. ఆగస్టు 21, 2025న స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వీరిలో 8 మంది  పోచారం శ్రీనివాస్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, యాదయ్య, తెల్లం వెంకటరావు, మహిపాల్ రెడ్డి, సంజయ్ రిప్లైలు ఇచ్చారు. వీటిని పిటిషనర్లకు ఫార్వర్డ్ చేసి, 3 రోజుల్లో  అభ్యంతరాలు సమర్పించమని చెప్పారు. సెప్టెంబర్ 19న అదనపు నోటీసులు ఇచ్చి, "అదనపు ఎవిడెన్స్ సమర్పించండి" అని ఆదేశించారు. బీఆర్ఎస్ పిటిషనర్లు  అఫిడవిట్ రూపంలో సమర్పించారు. ఈ కేసుల్లో క్రాస్-ఎగ్జామినేషన్ కీలకం. 

Continues below advertisement

సెప్టెంబర్ 29 సోమవారం, 11 గంటలకు  చింత ప్రభాకర్ vs గుడెం మహిపాల్ రెడ్డి, చింత ప్రభాకర్ vs కాలే యాదయ్య, కల్వకుంట్ల సంజయ్ vs టి. ప్రకాశ్ గౌడ్. పల్లా రాజేశ్వర్ రెడ్డి vs బండ్లా కృష్ణమోహన్ రెడ్డి లను క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు.  అక్టోబర్ 1 బుధవారం  మిగిలిన వాదనలు, క్రాస్-ఎగ్జామినేషన్. రెండు వైపులా ఆర్గ్యుమెంట్స్ వింటారు.