Diesel Compact SUVs GST 2025 Cut: కొత్త GST 2.0, భారత కార్ల మార్కెట్‌కు ‍‌(GST Reforms 2025 Impact On Cars) గణనీయంగా ఉపశమనం కలిగించింది. పన్ను తగ్గింపు కారణంగా, కాంపాక్ట్ డీజిల్ SUVలను గతంలో కంటే మరింత చవకగా కొనుగోలు చేసే అవకాశం వచ్చింది. రేట్లు తగ్గిన కాంపాక్ట్‌ డీజిల్‌ SUVల లిస్ట్‌లో Kia Syros, Kia Sonet, Mahindra 3XO, Tata Nexon & Mahindra Thar కూడా ఉన్నాయి, కస్టమర్లకు లక్షల రూపాయలను ఆదా చేస్తున్నాయి. డీజిల్‌ SUV కొనాలని కలలు కనే వారికి ఇది గొప్ప అవకాశంగా మారింది.

Continues below advertisement

Kia Syros పై అతి పెద్ద డిస్కౌంట్ కాంపాక్ట్ డీజిల్ SUV విభాగంలో కియా సైరోస్ అత్యంత ఎక్కువ డిస్కౌంట్ పొందిన కారుగా మారింది. కొత్త GST సంస్కరణల అమలు తర్వాత, Kia Syros HTX+ (O) AT వేరియంట్ రేటు రూ. 1.86 లక్షల వరకు తగ్గింది. ఈ డిస్కౌంట్‌తో, సైరోస్ ఇప్పుడు మరింత తక్కువ ధరలోకి మారింది, ప్రీమియం అనుభూతిని & శక్తిమంతమైన ఇంజిన్‌ను అందిస్తుంది. అయితే, దీని లాంచ్ నుంచి అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. ఇప్పుడు, ఈ కొత్త డిస్కౌంట్‌ ఈ బండి మార్కెట్లో పట్టు సాధించడానికి సాయపడుతుంది.

రూ. 1.64 లక్షల వరకు తగ్గిన Kia Sonet ధరకియా సోనెట్, దాని స్టైల్‌ & ఫీచర్ల పరంగా చాలా మందికి ఇష్టమైన కారు. ఇప్పుడు, Kia Sonet GTX Plus AT డీజిల్ వేరియంట్ ధర రూ. 1.64 లక్షల వరకు దిగి వచ్చింది, దీని వలన సోనెట్ సబ్-4 మీటర్ SUV విభాగంలో మరింత అందుబాటు ధర ఆప్షన్‌గా మారింది.

Continues below advertisement

Mahindra XUV 3XO: రూ. 1.56 లక్షల వరకు ఆదా చేయండిమహీంద్రా XUV 3XO లో AX7L డీజిల్ వేరియంట్ ధర కూడా గణనీయంగా తగ్గింది. దృఢమైన డిజైన్ & బలమైన పెర్ఫార్మెన్స్‌తో పాటు అందుబాటు ధర కాంపాక్ట్‌ SUVగా ఈ కారు పాపులర్‌. ఇప్పుడు, కొత్త జీఎస్‌టీ తర్వాత రేటు తగ్గడంతో మరింత అందుబాటులోకి వచ్చింది. రూ. 1.56 లక్షల వరకు పొదుపుతో, ఈ కారు మరింత మంది కస్టమర్లను ఆకర్షించే అవకాశం ఉంది & ఈ విభాగంలో మరిన్ని సేల్స్‌తో తన స్థానాన్ని బలోపేతం చేసుకోగలదు.

Tata Nexon పై ₹1.55 లక్షల వరకు తగ్గింపుభారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUV టాటా నెక్సాన్, ఇప్పుడు మరింత బడ్జెట్‌-ఫ్రెండ్లీ కారుగా అవతరించింది. కొత్త SGT అమలులోకి వచ్చిన తర్వాత, టాటా నెక్సాన్‌ ఫియర్‌లెస్ ప్లస్ PS DK వేరియంట్ ధర రూ. 1.55 లక్షల వరకు తగ్గింది. టాటా నెక్సాన్ ఇప్పటికే భద్రత & ఫీచర్లకు పెట్టింది పేరు. ఇప్పుడు మరింత తక్కువ ధరతో మార్కెట్లో దీనికి మరింత డిమాండ్ రావచ్చు.

Mahindra Thar కూడా రూ.1.35 లక్షల వరకు చవకఆఫ్-రోడ్ ప్రియుల అభిమాన కారు మహీంద్రా థార్ ఇప్పుడు మరింత అందుబాటులోకి వచ్చింది. SGT 2025 తర్వాత థార్‌ LX 2WD డీజిల్ వేరియంట్ ధర రూ. 1.35 లక్షల వరకు తగ్గింపును చూసింది. ఈ డిస్కౌంట్‌తో.. సాహస యాత్ర & బలమైన రహదారి ఉనికిని కోరుకునే కస్టమర్లకు థార్‌ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.