సంక్రాంతి పండక్కి జనాలు సొంతూర్లకు వెళ్లేందుకు ఆర్టీసీతో పాటు రైల్వే కూడా ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరం ఉన్న మార్గాల్లో మరో 30 కి పైగా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. జనవరి 1 నుంచి 20 మధ్య కాలంలో ఈ స్పెషల్ రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, వికారాబాద్ స్టేషన్‌ల నుంచి నర్సాపూర్, మచిలీపట్నం, కాకినాడ నగరాలకు ఇవి అందుబాటులో ఉంటాయి. వీటిలో ఎక్కువ జనరల్ బోగీలతో పాటు, రిజర్వ్‌డ్ బోగీలు కూడా ఉండనున్నాయి. రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం ఆయా ప్రాంతాలకు చేరుకొనే విధంగా ఈ రైళ్లను నడిపేలా సమయాలను సెట్ చేశారు.
ఇప్పటికే జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు 94 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. వీటికి తోడు మరో 30 సర్వీసులను నడపనున్నారు. అన్ని ప్రత్యేక రైళ్లకు ఈ నెల 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగీల్లో ప్రయాణించాలనుకొనేవారు యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు.
సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07048) - జనవరి 6
కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07049) - జనవరి 7
హైదరాబాద్–నర్సాపూర్ (070 19) - జనవరి 7
నర్సాపూర్–వికారాబాద్ (070 20) - 8
వికారాబాద్–నర్సాపూర్ (070 21) - 9
నర్సాపూర్–హైదరాబాద్ (07022) - జనవరి 10
సికింద్రాబాద్–కాకినాడటౌన్ (07039) 9
కాకినాడటౌన్–వికారాబాద్ (07040) - జనవరి 10
వికారాబాద్–నర్సాపూర్ (07041) జనవరి 11
నర్సాపూర్–సికింద్రాబాద్ (07042) జనవరి 12
హైదరాబాద్ – మచిలీపట్నం (07011) - జనవరి 11, 13 తేదీల్లో
మచిలీపట్నం–హైదరాబాద్ (07012) - జనవరి 12, 14 తేదీల్లో
సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07035) - జనవరి 11
కాకినాడ టౌన్–వికారాబాద్ (07036) - జనవరి 12
వికారాబాద్– కాకినాడటౌన్ (07037) - జనవరి 13
కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07038) - జనవరి 14
సికింద్రాబాద్–నర్సాపూర్ (07023) - జనవరి 13
నర్సాపూర్–సికింద్రాబాద్ (07024) - జనవరి 14
సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07027) - జనవరి 16
కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07028) - జనవరి 17
సికింద్రాబాద్–కాకినాడ టౌన్ (07031) - జనవరి 15
కాకినాడ టౌన్–వికారాబాద్ (07032) - జనవరి 16
వికారాబాద్–కాకినాడ టౌన్ (07033) - జనవరి 17
కాకినాడ టౌన్–సికింద్రాబాద్ (07034) - జనవరి 18
హైదరాబాద్–నర్సాపూర్ (07015) - జనవరి 15, 17 తేదీల్లో
నర్సాపూర్–హైదరాబాద్ (07016) - జనవరి 16, 18 తేదీల్లో