SCR Announced Special Trains For Sankranthi Festival: సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే 32 ప్రత్యేక రైళ్లు ప్రకటించగా తాజాగా మరో 5 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. తిరుపతి - సికింద్రాబాద్ (Secunderabad), కాకినాడ - సికింద్రాబాద్, కాకినాడ (Kakinada) - తిరుపతి (Tirupati) మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. ఈ నెల 10, 11, 12, 13 తేదీల్లో వీటిని నడపనున్నట్లు వెల్లడించారు.


షెడ్యూల్ ఇదే



  • ఈ నెల 10న తిరుపతి - సికింద్రాబాద్ (07065) రైలు ఉదయం 5:30 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, కర్నూలు, గద్వాల, జడ్చర్ల, షాద్ నగర్, కాచిగూడ స్టేషన్లలో ఆగుతుంది.

  • ఈ నెల 10న సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ (07066) రైలు సాయంత్రం 7 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:10 గంటలకు కాకినాడ చేరుతుంది.

  • ఈ నెల 11న కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ (07067) రైలు రాత్రి 9 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి తర్వాత రోజు ఉదయం 08:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

  • ఈ నెల 12న సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ (07250) రైలు సాయంత్రం 06:05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 05:30కు కాకినాడ చేరుకుంటుంది.

  • ఈ నెల 13న కాకినాడ టౌన్ - తిరుపతి (07249) రైలు సాయంత్రం 05:10 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 04:30 గంటలకు తిరుపతి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.






32 ప్రత్యేక రైళ్లు


అంతకు ముందు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 32 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ద.మ రైల్వే ప్రకటించింది. ఈ నెల 27 వరకూ ఈ రైళ్లు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రైళ్లలో స్లీపర్‌, జనరల్‌ బోగీలతో పాటు ఫస్ట్‌ ఏసీ, సెకెండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ సీట్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటనలో తెలిపింది. 






ట్రైన్ నెంబర్ 07089  సికింద్రాబాద్‌- బ్రహ్మపుర్‌ - జనవరి 7, 14 తేదీలు
ట్రైన్ నెంబర్ 07090  బ్రహ్మపుర్‌ - వికారాబాద్ - జనవరి 8, 15 తేదీలు
ట్రైన్ నెంబర్ 07091  వికారాబాద్- బ్రహ్మపుర్‌ - జనవరి 9, 16 తేదీలు
ట్రైన్ నెంబర్ 07092  బ్రహ్మపుర్‌ - సికింద్రాబాద్ - జనవరి 10, 17 తేదీలు
ట్రైన్ నెంబర్ 08541  విశాఖ - కర్నూలు సిటీ - జనవరి 10, 17, 24 తేదీలు
ట్రైన్ నెంబర్ 08542  కర్నూలు సిటీ - విశాఖ - జనవరి 11, 18, 25 తేదీలు
ట్రైన్ నెంబర్ 08547  శ్రీకాకుళం - వికారాబాద్ - జనవరి 12, 19, 26 తేదీలు
ట్రైన్ నెంబర్ 08548  వికారాబాద్ - శ్రీకాకుళం - జనవరి 13, 20, 27 తేదీలు
ట్రైన్ నెంబర్ 02764  సికింద్రాబాద్ - తిరుపతి - జనవరి 10, 17 తేదీలు
ట్రైన్ నెంబర్ 02763 తిరుపతి - సికింద్రాబాద్ - జనవరి 11, 18 తేదీలు
ట్రైన్ నెంబర్ 07271  సికింద్రాబాద్ - కాకినాడ - జనవరి 12 తేదీ
ట్రైన్ నెంబర్ 07272  కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ - జనవరి  13 తేదీ
ట్రైన్ నెంబర్ 07093  సికింద్రాబాద్ - బ్రహ్మపూర్ - జనవరి 8, 15 తేదీలు
ట్రైన్ నెంబర్ 07094   బ్రహ్మపూర్ - సికింద్రాబాద్ - జనవరి 9, 16 తేదీలు
ట్రైన్ నెంబర్ 07251  నర్సాపూర్ - సికింద్రాబాద్ - జనవరి 10 తేదీ
ట్రైన్ నెంబర్ 07052  సికింద్రాబాద్ - నర్సాపూర్ - జనవరి 11 తేదీ


ప్రత్యేక బస్సులు సైతం


మరోవైపు, సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా 4,484 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. వీటిలో 626 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించింది ఆర్టీసీ. జనవరి 7 నుంచి 15 వ తేది వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఏపీకి షెడ్యూల్ సర్వీసులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి పండుగకు బస్సు చార్జీల్లో ఎలాంటి పెంపు ఉండదని, గతంలో మాదిరిగానే సాధారణ చార్జీలతోనే ప్రత్యేక బస్సు సర్వీస్‌లను నడుపుతున్నట్లు తెలిపారు. 


Also Read: Telangana News: పెండింగ్ చలాన్లు చెల్లించారా.? - వాహనదారులకు బిగ్ అలర్ట్