SCR Special Train Between Secunderabad And Santragachi: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ (Secunderabad) - సంత్రగాచి (Santragachi) - సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడిపించినున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్ - సంత్రగాచి (07243) మధ్య జూన్ 30 వరకూ ప్రతి ఆదివారం, అలాగే, సంత్రగాచి - సికింద్రాబాద్ (07235) మధ్య జులై 2 వరకూ ప్రతి మంగళవారం ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్ - సంత్రగాచి మధ్య ప్రతి ఆదివారం రాత్రి 11:40 గంటలకు బయలుదేరి మూడో రోజు ఉదయం 5:50 గంటలకు సంత్రగాచి చేరుతుంది. అలాగే, సంత్రగాచి - సికింద్రాబాద్ మధ్య రైలు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:20 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ చేరకుంటుంది.
ఈ స్టేషన్లలో స్టాప్స్
ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బరంపూర్, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, బాలాసోర్, ఖరగ్ పూర్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.
ప్రత్యేక రైళ్లు పొడిగింపు
మరోవైపు, వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ - రామాంతపూర్ (07695) జూన్ 26 వరకూ, రామాంతపూర్ - సికింద్రాబాద్ (07696) జూన్ 28 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే, సికింద్రాబాద్ - దిబ్రుఘర్ (07046) జూన్ 24 వరకూ, దిబ్రుఘర్ - సికింద్రాబాద్ (07047) జూన్ 27 వరకూ పొడిగించినట్లు చెప్పారు. ప్రయాణికులు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించారు.
Also Read: Disha Case Updates: దిశ ఎన్‌కౌంటర్ ఘటనలో పోలీసులకు భారీ ఊరట, హైకోర్టు కీలక తీర్పు