Telangana Musi project: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి రెండేళ్లు అవుతున్నా.. సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు ఇంకా మొదటి దశలోనే ఉంది. 2023 డిసెంబర్ 7న సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ ను రివర్ సిటీగా మారుస్తామని లండన్, సియోల్ వంటి నగరాల్లో పర్యటించి వచ్చారు. రెండేళ్లు గడుస్తున్నా ఈ ప్రాజెక్టుకు ఇంకా డీపీఆరే సిద్ధం కాలేదు.
మురికి కాలువగా మారిన మూసీ నది
మూసీ నది, హైదరాబాద్‌కు జీవనాధారం. కృష్ణా నదిలోకి కలిసే ఈ నది, 11వ శతాబ్దంలో కాకతీయుల కాలంలోనే ప్రసిద్ధి చెందింది. హైదరాబాద్ ఏర్పడినప్పటి నుంచి ఈ నది నగరం మధ్య నుంచి వెళ్తోంది. కానీ గత పాతికేళ్లుగా కాలుష్యం, పట్టించుకోకపోవడం వల్ల ఇది మురికి కాలువగా మారింది. 1997లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మూసీని కాంక్రీట్ డ్రైన్‌గా మార్చి, రివర్‌ఫ్రంట్ అభివృద్ధి చేసే ఆలోచన వచ్చింది. కానీ, అమలు కాలేదు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం 2017 మార్చి 25న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ను ఏర్పాటు చేసింది . ప్రీ-ఫీజిబిలిటీ స్టడీలు జరిగాయి, కానీ పెద్దగా అభివృద్ధి లేదు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ మూసీ ప్రక్షాళన ను ముఖ్య హామీగా చేసుకుంది. రేవంత్ రెడ్డి, సీయోల్ మోడల్‌తో మూసీని మార్చి, హైదరాబాద్‌ను ప్రపంచ నగరంగా చేస్తాం అని ప్రకటించారు.
అధికారంలోకి రాగానే హడావుడి
2023 డిసెంబర్ తర్వాత, ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకున్నట్లుగా కనిపించింది. 2024 జనవరి 2న, సీఎం రేవంత్ రెడ్డి HMDA అధికారులతో సమీక్షలో 36 నెలల్లో మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి చేయాలి అని ఆదేశాలు జారీ చేశారు. అందులో పన్నెండు నెలలు గడిచిపోయాయి. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు ప్లానేంటో కూడా ఎరికీ తెలియదు. 2024 అక్టోబర్‌లో 141 కోట్లతో 18 నెలల్లో DPR తయారు చేయాలని టెండర్ పిలిచారు. DPR తర్వాత, 5 సంవత్సరాలు పెట్టుబడి సలహాలు ఇవ్వాలని ప్లాన్. 2025లో బడ్జెట్‌లో 1,500 కోట్లు కేటాయించారు. కానీ వాటితో ఏ పనులు చేయలేకపోయారు.
కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఆరోపణలు
ఇప్పటి వరకూ మూసీ నది ఒడ్డున ప్రభుత్వ భూములను MRDCLకు బదిలీ చేశారు DPR ఇంకా పూర్తి కాలేదు . ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి ఫండింగ్ ధృవీకరణ లేదు. ఇంకా లిస్టెడ్ కాలేదు. DPR లేకుండానే 734 ఎకరాల భూమి బదిలీ చేశారు. బ్యాంక్ లోన్లు వచ్చే వరకూ ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్లడానికి ప్రబుత్వం వద్ద నిధులు లేవు. కేంద్రం సహకరించడం లేదని ఆరోపణలు చేస్తున్నారు. మొత్తంగా, మూసీ ప్రాజెక్టు స్వప్నాలుతో మొదలై, వాస్తవాల వలయంలో చిక్కుకుంది. రెండేళ్లు గడిచినా, పారదర్శకత, పునరావాసం అనే వాటిపై స్పష్టత లేదు. కనీసం పనులు జరుగుతూ ఉంటే.. చేస్తున్నారని అనుకుంటారు. అసలు ప్రభుత్వానికే క్లారిటీ లేదని ప్రజలు అనుకునే ఎక్కడిదక్కడ ఆగిపోపోయింది. ఇక ముందైనా మూసి ప్రక్షాళనకు సీరియస్ గా ప్రయత్నాలు చేస్తారా?